ఇప్పుడంటే జ్యోతిష్యాలు కానీ.. అప్పట్లో ఈయన కథ వేరేలెవల్!
మనం ఎప్పుడూ చూడని కొందరు ప్రముఖ వ్యక్తుల త్రో బ్యాక్ ఫొటోలు అప్పుడప్పుడు నెట్టింట దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్, సినిమా సెలబ్రిటీల త్రో బ్యాక్ ఫొటోలు, ఛైల్డ్ హుడ్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలా కొన్ని రోజులుగా ఒక ప్రముఖ వ్యక్తి ఫొటో నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటో చూడగానే.. అందర్నీ నుంచి క్రేజీ రియాక్షన్ కూడా వస్తోంది.
ఇంతకీ ఆ ఫోటోలో ఉంది మరెవరో కాదు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా ఇప్పుడు ఫేమస్ అయిన వేణు స్వామే.. ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోల్లో.. వేణు స్వామి.. సినిమా యాక్టర్ లాగా డిఫరెంట్ పోజుల్లో కనిపిస్తున్నాడు. అయితే గతంలో వేణు స్వామి పలు సినిమాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మోహన్ బాబు అల్లరి మొగుడు, అలాగే మహేష్ బాబు యువరాజు తదితర సినిమాలకు వేణు స్వామి పూజలు చేయించిన ఫొటోలు గతంలో బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు వేణు స్వామి కొన్ని సినిమాల్లోనూ తళుక్కున మెరిశారు. జగపతిబాబు హీరోగా చేసిన ‘జగపతి’ అనే తెలుగు సినిమాలో గుడిలో పూజారి పాత్రలో కనిపించారు వేణు స్వామి. ఈ సినిమా 2005లో వచ్చింది. అప్పుడు వేణుస్వామి ఎవరనేది పెద్దగా తెలియదు. అలాగే సోషల్ మీడియాకూడా లేదు. దీంతో ప్రేక్షకులు వేణు స్వామిని పెద్దగా గుర్తుంచుకోలేకపోయారు. ఇక మహేష్ బాబు నటించిన ‘అతడు’ చిత్రంలోనూ ఓ పాటలో కనిపించారీ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఇందులోనూ పెళ్లి జరిపించే పురోహితుడిగానే వేణు స్వామి కనిపించారు. అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు మాత్రం వేణు స్వామి సినిమాల్లో హీరోగా ట్రై చేసినప్పటివనీ తెలుస్తోంది. ఎస్ ! యంగ్ ఏజ్ నుంచి సినిమాలంటే ఇష్టపడే వేణు స్వామి… ఓ స్టేజ్‌లో సినిమాల్లో హీరోగా ట్రై చేసేందుకు తన డిఫరెంట్ లుక్స్‌తో.. స్టిల్స్‌తో పోర్ట్ ఫోలియో రెడీ చేసుకున్నాడట. ఆ ఫోటోలను పట్టుకుని టాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిరిగే వాడట. అయితే అప్పటి ఆ ఫోటోలు.. ఇప్పుడు ఉన్నట్టుండి నెట్టింట బయటికి వచ్చాయి. దాంతో అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాకయ్యేలా చేస్తున్నాయి. ఇప్పుడంటే పూజలు, జ్యోతిష్యాలు కానీ.. అప్పట్లో మనోడి కథ వేరేలెవల్ అంతే అనే కామెంట్ వస్తోంది ఫన్నీగా..”!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్తతో స్టార్ హీరోయిన్ కటీఫ్? ఇన్‌స్టాతో బట్టబయలు
జాన్వీ బిగ్ స్కెచ్.. చరణ్ సినిమాతో టార్గెట్ అఛీవ్డ్
తొమ్మిదేళ్ల కలను నిజం చేసుకునేందుకు.. పెళ్లి వాయిదా వేసుకున్న స్టార్ హీరో