Renukaswamy Murder: ఆమె మోజుతోనే బరి తెగించాడు.! పక్కా ఎవిడెన్స్‌తో అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్

Renukaswamy Murder: ఆమె మోజుతోనే బరి తెగించాడు.! పక్కా ఎవిడెన్స్‌తో అడ్డంగా బుక్కైన డీ – గ్యాంగ్

Anil kumar poka

|

Updated on: Aug 15, 2024 | 5:10 PM

రేణుకస్వామి మర్డర్‌ కేసులో కన్నడ ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్, అతని ప్రేయసి పవిత్ర గౌడ ఇప్పటికే జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. రేణుకా స్వామి మర్డర్‌ కేసులో ఇప్పటికే ఎన్నో కీలక ఆధారాలను సేకరించారు బెంగళూరు పోలీసులు. పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్‌లు పెట్టాడని రేణుకస్వామిని కిడ్నాప్‌ చేయించి హత్య చేశారని దర్యాప్తులో తేల్చారు. దర్శన్‌, పవిత్ర గౌడ అండ్‌ గ్యాంగ్‌ రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి హత్య చేసిందని.. శవాన్ని కాలువలో పడేశారని భావిస్తున్నారు.

రేణుకస్వామి మర్డర్‌ కేసులో కన్నడ ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్, అతని ప్రేయసి పవిత్ర గౌడ ఇప్పటికే జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. రేణుకా స్వామి మర్డర్‌ కేసులో ఇప్పటికే ఎన్నో కీలక ఆధారాలను సేకరించారు బెంగళూరు పోలీసులు. పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్‌లు పెట్టాడని రేణుకస్వామిని కిడ్నాప్‌ చేయించి హత్య చేశారని దర్యాప్తులో తేల్చారు. దర్శన్‌, పవిత్ర గౌడ అండ్‌ గ్యాంగ్‌ రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి హత్య చేసిందని.. శవాన్ని కాలువలో పడేశారని భావిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో దర్శన్‌ కారును గుర్తించారు. బెల్టుతో కర్రలతో కొట్టడమే కాదు కరెంట్‌ షాక్‌ ఇచ్చారు నిందితులు. మర్డర్‌ స్పాట్‌లో ఆనవాళ్లను సేకరించి FSLకు పంపారు పోలీసులు. ఇప్పుడు ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ పోలీసుల చేతికి వచ్చింది. రేణుకస్వామిని హత్య చేసిన షెడ్‌లో.. డెడ్‌బాడీని తరలించిన స్కార్పియో వెహికల్‌లో రక్తపు మరకలు, వేలిముద్రలపై క్లారిటీ వచ్చింది.

ఇక ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌లో డీ గ్యాంగ్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ మ్యాచ్‌ అయినట్టు తెలుస్తోంది. ఈ నివేదికతో దాదాపు 70 శాతం ఎవిడెన్స్‌ రికార్డయినట్టే . ఇక సీసీటీవీ ఫుటేజ్‌ ..ఆడియో శాంపిల్స్‌పై రిపోర్ట్‌ రావాల్సి వుంది. అందుకే ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఆ రిపోర్టులపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పక్కా ఆధారాలను సేకరించారు. మరోవైపు ఇంటి భోజనం కావాలంటూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు దర్శన్‌. జైలులో రాజభోగాలు కల్పిస్తున్నారని ఇప్పటికే పెద్ద రచ్చ జరిగింది. ఏకంగా సీఎం సిద్దరామయ్య వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఇక రూల్‌ ఈజ్‌ రూల్‌.. ఫర్‌ ఆల్‌.. వీఐపీలైనా సరే స్టార్లయినా సరే సాటి ఖైదీల్లాగా జైలు ఫుడ్డే తినాలే తప్పా ఇంటి భోజనం కుదరదని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో దర్శన్‌ పిటిషన్‌ విచారణ వాయిదా పడింది. ఇప్పుడు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికతో డీ గ్యాంగ్‌కు చట్టప్రకారం కఠిన శిక్ష తప్పదన్న టాక్‌ విన్పిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.