పైరసీకి అడ్డుకట్ట వేయాలంటే.. ఆ పని చేయాల్సిందేనా ??

Edited By:

Updated on: Nov 19, 2025 | 3:11 PM

సినిమా పైరసీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఐబొమ్మ రవి అరెస్టు ఈ సమస్య తీవ్రతను తెలియజేసింది. కేవలం అరెస్టులతోనే కాకుండా, ప్రేక్షకులు సినిమా టికెట్లు, క్యాంటీన్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. పైరసీని అరికట్టాలంటే ధరలు అందుబాటులోకి తేవాలని, అప్పుడే కష్టపడ్డవారికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

మన సినిమా వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇంటర్నేషనల్‌ స్టాండర్స్ తో అక్కడివారిని ఆకర్షిస్తోంది. ఇలాంటి సమయంలో పైరసీ మన సినిమాను పీడించకూడదు. అంతా హెల్దీగా ఉండాలంటే ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తే సరిపోతుందా? మార్పు ఎక్కడ జరగాలి? ఎలా మొదలవ్వాలి? 24 క్రాఫ్ట్స్ పగలూ రాత్రీ, ఎండా వానా తేడా లేకుండా సినిమాలు చేస్తే రెండున్నర గంటల వినోదం అందుబాటులోకి వస్తుంది. దాన్ని సింపుల్‌గా కాపీ చేసేస్తా… లీక్‌ చేసేస్తా అంటూ కష్టపడిన వారికి కడుపు మండదా? ఐబొమ్మ రవి అరెస్ట్ అయినప్పుడు సినిమావాళ్లు పండగ చేసుకున్నారు. ఇతనొక్కడిని అరెస్ట్ చేస్తే చాలదు.. ఇలాంటి చీడపురుగులు చాలా మంది ఉంటారు. అందరినీ వెతికి పట్టుకుని తగిన శిక్ష వేయండి అంటోంది ఇండస్ట్రీ. సినిమా పైరసీలు చాలా వరకు సర్వర్ల ద్వారానే జరుగుతుంటాయి. కొన్నిసార్లు టెక్నాలజీని వాడి సెల్‌ఫోన్ల ద్వారా కూడా రికార్డులు చేస్తున్నారు పైరసీదారులు. అలాగని థియేటర్లలోకి సెల్‌ఫోన్లను అనుమతించం అంటే కుదరని పరిస్థితి. అయినా పైరసీని అడ్డుకోవాలనే సంకల్పం కనిపిస్తోంది అందరిలో. ఇండస్ట్రీ పరంగానూ మార్పు రావాలంటున్నారు జనాలు. టిక్కెట్‌ ధర సామాన్యులకు అందుబాటులోకి వస్తే పైరసీ చూడాల్సిన దౌర్భాగ్యం ఎందుకంటున్నారు. అంతే కాదు.. టిక్కెట్‌ ప్రైజ్‌ తగ్గిస్తే సరిపోదు… క్యాంటీన్‌ ధరలు కూడా మధ్య తరగతికి అందుబాటులో ఉండాలనే మాట గట్టిగా వినిపిస్తోంది. డిజిటల్‌చౌర్యం గురించి మాట్లాడే సినీ ప్రముఖులు.. ఈ టిక్కెట్‌, క్యాంటీన్‌ ధరల మీద కూడా ఫోకస్‌ పెంచాలంటున్నారు ఆడియన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు పార్టులు‌గా రానున్న ప్రభాస్ ఫౌజీ ?? ఆనందంలో అభిమానులు

వైరల్‌ వయ్యారికి లేడీ సూపర్‌స్టార్‌ సలహాలు.. ఇంకా హిట్ పక్కనా ??

వరుస షూటింగ్స్ తో షేక్ అవుతున్న లొకేషన్స్..

Top9 ET: ‘వారణాసి’ టైటిల్‌ వివాదం జక్కన్నకు దెబ్బ మీద దెబ్బ

పాపులారిటీ ఏమో కానీ.. తన భర్త విషయంలో ఈ నటికి తీవ్ర బాధ

Published on: Nov 19, 2025 03:11 PM