గేమ్‌ ఛేంజర్‌కి మించి..నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందా..?

|

Jan 16, 2025 | 5:07 PM

ట్రిపులార్ సినిమా తరవాత రామ్ చరణ్ రేంజ్ పెరిగిపోయింది. అదే స్థాయిలో మార్కెట్‌ కూడా పెరిగింది. ట్రిపులార్‌కి ముందు ఓ లెక్క. తరవాత ఓ లెక్క అన్నట్టుగా చెర్రీ కెరీర్ టర్న్ తీసుకుంది. అయితే...ఆ సినిమా తరవాత సోలో హీరోగా గేమ్‌ ఛేంజర్‌తో ముందుకొచ్చాడు రామ్ చరణ్. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. పండుగ రోజులు కావడం వల్ల బుకింగ్స్ కూడా జోరందుకున్నాయి. వసూళ్లూ గట్టిగానే వస్తున్నాయి. డైరెక్టర్ శంకర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్‌ అందించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్‌కి మంచి అప్లాజ్ వస్తోంది. ఇక చెర్రీ నటనపైనా ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అప్పన్న పాత్ర గురించి సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. రామ్ చరణ్ ఈ క్యారెక్టర్‌లో అదరగొట్టేశాడని పొగుడుతున్నారు. ఇలా పాజిటివ్ బజ్‌తో ఆడుతోంది గేమ్ ఛేంజర్ సినిమా. ఇదంతా ఓకే. బట్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌ తరవాతి ప్రాజెక్ట్ సంగతేంటి..? అప్పుడే ఈ డిస్కషన్ మొదలైంది.

 చెర్రీ..తరవాతి సినిమాని బుచ్చిబాబుతో ప్లాన్ చేసుకున్నాడు. సుకుమార్ ప్రియశిష్యుడైన బుచ్చిబాబు ఇప్పటికే ఉప్పెనని డైరెక్ట్ చేశాడు. నేషనల్ అవార్డు కూడా సాధించాడు. కాకపోతే..స్కేల్ వైజ్‌గా చూసుకుంటే…బుచ్చిబాబుకి రామ్ చరణ్ ప్రాజెక్ట్ చాలా పెద్దది. అందుకే…భారీగానే ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ ఇప్పటికే మైసూర్‌లో జరిగింది. ఓ గ్రామంలో ఈ కథంతా నడుస్తుందని సమాచారం. అయితే…ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని డీల్ చేయడం అంత చిన్న విషయం కాదు. అభిమానుల అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని అందుకోవాలంటే ఫుల్ మీల్స్ పెట్టేయాల్సిందే. పైగా AR రహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తుండడం మరో స్పెషల్ అట్రాక్షన్. రహమాన్ నేరుగా తెలుగు సినిమా చేసి చాన్నాళ్లైంది. ఇప్పుడు నేరుగా గ్లోబల్ స్టార్ చెర్రీ సినిమాకి మ్యూజిక్ అంటే అందరూ పాటలపైనా గట్టిగానే అంచనాలు పెట్టుకుంటారు. ఈ ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టుగా అన్నీ కుదరాలి. కుదిరేలా చేసుకునే బాధ్యత బుచ్చిబాబుపై పడింది. తన బాస్ సుకుమార్ పర్యవేక్షణలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు. అయితే.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు అనగానే కథలో కచ్చితంగా ఓ పర్‌ఫెక్ట్ కాన్‌ఫ్లిక్ట్ ఉండాలని కోరుకుంటారు. హీరోయిజం చూపిస్తూనే..కథలో మంచి డ్రామాని ఆశిస్తారు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయడమే బుచ్చిబాబు ముందున్న అతి పెద్ద టాస్క్. పైగా ఇది తన కెరీర్‌కి టర్నింగ్ పాయింట్.