చిక్కుల్లో కాంత..దుల్కర్ రియాక్షన్ ఏంటి..?వీడియో

Updated on: Nov 13, 2025 | 1:18 PM

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన కాంత చిత్రం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. దివంగత లెజెండరీ నటుడు ఎం.కే. త్యాగరాజ భాగవతార్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. కుటుంబ అనుమతి లేకుండా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని భాగవతార్ మనవడు బి. త్యాగరాజన్ చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బయోగ్రాఫికల్ చిత్రాలు నిర్మించడం ఈ మధ్యకాలంలో సవాలుగా మారుతోంది. ఎంత జాగ్రత్తగా రూపొందించినా, నిజ జీవిత పాత్రల నేపథ్యంలో తీసిన సినిమాలపై విమర్శలు ఎదురవుతున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న దుల్కర్ సల్మాన్ ద్విభాషా చిత్రం కాంత కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. 1950ల నాటి సినీ పరిశ్రమ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్ స్టార్ హీరో పాత్రను పోషించారు. కాంత టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించడంతో, మహానటి మాదిరిగానే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని అంచనాలున్నాయి. అయితే, సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఇది లెజెండరీ ఆర్టిస్ట్ ఎం.కే. త్యాగరాజ భాగవతార్ బయోపిక్ అని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

మరో స్పెషల్‌ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో

మాట జారాను.. మన్నించండి వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో