ఒకే ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేసిన రతన్.. మళ్లీ ఆ వైపు ఎందుకు చూడలేదు ??

|

Oct 14, 2024 | 6:48 PM

వ్యాపార దిగ్గజంగా పేరు తెచ్చుకున్న రతన్ టాటాకు సినిమా ఇండస్ట్రీతోనూ సంబంధం ఉంది. సినిమాలంటే అమితంగా ప్రేమించే ఈయన..ఓ సారి ఓ డేర్ స్టెప్‌ వేశారు. బాలీవుడ్లో ఓసినిమాను నిర్మించారు. కానీ ఆ సినిమా అనుకున్న రిజల్ట్ ఇవ్వలేదు.. దీంతో ఆ తర్వాత సినిమాల వంకే చూడడం మానేశారాయన. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ఏత్ బార్ మూవీ

వ్యాపార దిగ్గజంగా పేరు తెచ్చుకున్న రతన్ టాటాకు సినిమా ఇండస్ట్రీతోనూ సంబంధం ఉంది. సినిమాలంటే అమితంగా ప్రేమించే ఈయన..ఓ సారి ఓ డేర్ స్టెప్‌ వేశారు. బాలీవుడ్లో ఓసినిమాను నిర్మించారు. కానీ ఆ సినిమా అనుకున్న రిజల్ట్ ఇవ్వలేదు.. దీంతో ఆ తర్వాత సినిమాల వంకే చూడడం మానేశారాయన. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ఏత్ బార్ మూవీ.! నలుగురు ప్రొడ్యూసర్స్ కలిసి నిర్మించిన ఈ మూవీకి రతన్ టాటా వన్ ఆఫ్‌ ది ప్రొడ్యూసర్స్ ‌గా వ్యవహరించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 1992లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘ఫియర్’ స్ఫూర్తితో ఏత్ బార్ సినిమా తెరకెక్కింది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో పాటు జాన్ అబ్రహం, బిపాసా బసు, సుప్రియా పిల్గాంకర్ తదితరులు నటించారు. 2002లో విడుదలైన ఈ సినిమా బడ్జెట్ 9.50 కోట్లు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 7.50 కోట్లు మాత్రమే రాబట్టింది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రతన్ టాటా మళ్లీ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టలేద. అలా ప్రొడ్యూసర్‌గా ఆయన తీసిన మొదటి చిత్రమే చివరి సినిమా అయ్యింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేట్టయాన్ వివాదం పై.. అసలు వివరణ ఇదే

TOP 9 ET News: కొడుకు ధాటికి.. పక్కకు తప్పుకున్న తండ్రి

Published on: Oct 11, 2024 12:02 PM