Director Venu: ‘బలగం’ సింగర్స్‌కు డైరెక్టర్‌ వేణు ఆర్థిక సాయం.. వీడియో వైరల్..

Director Venu: ‘బలగం’ సింగర్స్‌కు డైరెక్టర్‌ వేణు ఆర్థిక సాయం.. వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Mar 27, 2023 | 8:58 AM

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఎంతో హృద్యంగా తెరకెక్కిన చిత్రం బలగం. జబర్దస్త్‌ కమెడియన్‌ యెల్దండి వేణు డైరెక్టర్‌గా మారి రూపొందించిన చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది.

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఎంతో హృద్యంగా తెరకెక్కిన చిత్రం బలగం. జబర్దస్త్‌ కమెడియన్‌ యెల్దండి వేణు డైరెక్టర్‌గా మారి రూపొందించిన చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. మెగాస్టార్‌ చిరంజీవి కూడా బలగం యూనిట్‌ను అభినందించారు. సినిమా విజయంలో పాటలు కీలక పాత్ర పోషించాయి. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే బుడగ జంగాల పాటలోని బుర్ర కథ గానాన్ని వరంగల్‌ జిల్లాకు చెందిన కొమురవ్వ, మొగిలయ్యలు ఆలపించారు. ఈ పాటతో కోట్లాది మంది మనసులు గెల్చుకున్న వీరు నిజ జీవితంలో మాత్రం ఎంతో దీన స్థితిలో ఉన్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మొగిలయ్యకు రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయి. ఎంతో ఖర్చు పెట్టి డయాలసిస్‌ ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నాడు. మొగిలయ్య దీన స్థితి గురించి తెలుసుకున్న డైరెక్టర్‌ వేణు వరంగల్‌ జిల్లా దుగ్గొండిలోని కొమురవ్వ, మొగిలయ్య ఇంటికి వెళ్లి లక్ష రూపాయలు ఆర్థికసాయం జేశారు. అంతేకాదు నిర్మాత దిల్‌రాజ్‌తో మాట్లాడి మరింత ఆర్థికసాయం అందేలా చూస్తానని మొగిలయ్య దంపతులకు హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వంతో మాట్లాడి వైద్య సాయంతో పాటు ఉచితంగా మందులు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక నేతలు, గేయ రచయిత కాసర్ల శ్యామ్‌, యాంకర్‌ గీత భగత్‌తో కలిసి మొగిలయ్య దంపతులకు 70 వేల రూపాయలు అందించారు. మరో 30 వేల రూపాయలు ఆయన బ్యాంక్‌ అకౌంట్‌లో డిపాజిట్‌ చేశారు. మొగిలయ్యకు రూ. లక్ష సాయం అందించి వేణు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడని అభిమానులు, నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Published on: Mar 27, 2023 08:58 AM