Srinu Vaitla: ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!

Srinu Vaitla: ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!

Anil kumar poka

|

Updated on: Oct 03, 2024 | 12:22 PM

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా తన మార్క్ చూపించాడు దర్శకుడు శ్రీను వైట్ల. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కామెడీ ఎంటర్టైమెంట్ తో పాటు పవర్ ఫుల్ కంటెంట్ తో సినిమాలను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు శ్రీనువైట్ల. కానీ ఈ మధ్య కాలంలో శ్రీను వైట్లకు సరైన హిట్ పడలేదు. మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్.

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా తన మార్క్ చూపించాడు దర్శకుడు శ్రీను వైట్ల. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కామెడీ ఎంటర్టైమెంట్ తో పాటు పవర్ ఫుల్ కంటెంట్ తో సినిమాలను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు శ్రీనువైట్ల. కానీ ఈ మధ్య కాలంలో శ్రీను వైట్లకు సరైన హిట్ పడలేదు. మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్. ఇక ఇప్పుడు విశ్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలోనే తన గొయ్యిని తానే తవ్వుకున్నా అంటూ.. ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాడు శ్రీను వైట్ల.

ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు శ్రీనువైట్ల. చాలా కాలం తర్వాత విష్ణు మంచు తో కలిసి సినిమా చేస్తున్న అని శ్రీనువైట్ల అనౌన్స్ చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో ఢీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ అందుకున్న విషయమూ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఢీ అంటే ఢీ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. కానీ ఈ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఇప్పుడు యాక్షన్ హీరో గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ ఆగడు సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు శ్రీను వైట్ల .

మహేష్ బాబు ఆగడు సినిమా విషయంలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోవడం తన తప్పే అని అన్నారు. నిజానికి ఆగడు సినిమాకు అనుకున్న కథ వేరే అని.. కానీ ఆ కథకు నిర్మాతల నుంచి అనుకున్నంత బడ్జెట్ కుదరకపోవడంతో.. కథ మార్చాల్సి వచ్చిందన్నాడు వైట్ల. పైగా దూకుడు సినిమా తర్వాత వచ్చిన చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయని అన్నాడు. దాంతో ఆ సినిమా కోసం కష్టపడినా కూడా ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ను అందుకోలేకపోయామన్నాడు. అంతేకాదు ఇది తనకు తానుగా తీసుకున్న గొయ్యి అంటూ చెప్పుకొచ్చాడు ఈ డైరెక్టర్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.