డాకు మహారాజ్‌పై రాజమౌళి తనయుడి రివ్యూ
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో డాకు మహారాజ్ ఒకటి. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఈ చిత్రం ఈరోజు అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీకి ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
బాలయ్య యాక్టింగ్.. అందుకు తగినట్లుగా డైరెక్టర్ బాబీ ఇచ్చిన ఎలివేషన్స్, మేకింగ్ చూస్తే సినిమా అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ డాకు మహారాజ్ మూవీపై ఆసక్తికర ట్వీట్ చేశాడు. “డాకుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాని త్వరగా చూడాలని కోరుకుంటున్నాను. ప్రోమో, టీజర్, ట్రైలర్ లోనే బాలయ్య ప్రజెన్స్ అదిరిపోయింది. బాలయ్యని బాబీ కొత్త అవతారంలో చూపించారు అంటూ ట్వీట్ చేశాడు కార్తికేయ. అయితే ప్రస్తుతం జక్కన్న కొడుకు చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ప్రభాస్ సీక్రెట్‌గా దాచుకున్న పెళ్లి మ్యాటర్
ఫ్యాన్స్ అసహనం.. దీంతో మేకర్స్ తీసుకున్నారు బంపర్ డెసిషన్
TOP 9 ET News: డాకు మహారాజ్ బంపర్ హిట్.. డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్