Karunakaran: ఆ రోజ్ పవన్ కళ్యాణ్ 6 గంటలు వెయిట్ చేశారట.! షాకింగ్ విషయం చెప్పిన కరుణాకరన్.

|

Jul 03, 2023 | 9:59 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అల్ టైం సూపర్ హిట్ మూవీ తొలిప్రేమ. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచిన ఈ మూవీతో పవన్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించారు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అల్ టైం సూపర్ హిట్ మూవీ తొలిప్రేమ. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచిన ఈ మూవీతో పవన్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించారు. కీర్తిరెడ్డి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆయన స్టైల్ కు ఫ్యాన్ ఫాలోయిన్ పెరిగిపోయింది. ఇక ఈ సినిమా అపట్లో క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి కూడా మారుమ్రోగుతున్నాయో. ఇదిలా ఉంటే తాజాగా తొలిప్రేమ సినిమాను రీ రీలీజ్ చేశారు. పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రీసెంట్ గా రీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. రికార్డు స్థాయిలో తొలిప్రేమ సినిమాకు కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు దర్శకుడు కరుణాకరన్. ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో అమితాబ్ ముందుగా అసహనం వ్యక్తం చేశారని కానీ ఆతర్వాత మెచ్చుకున్నారని తెలిపారు. క్లాసిక్ మూవీ అని అమితాబ్ కొనియాడారని తెలిపాడు.

అయితే పవన్ కళ్యాణ్ ను కలవడానికి కరుణాకరన్ కు దాదాపు ఏడూ 7 నెలల టైం పట్టిందట. పవన్ కళ్యాణ్ కు రాత్రి 7 గంటలకు అపాయింట్ మెంట్ ఇచ్చారట. అయితే కారు టైర్ పంచర్ అవ్వడంతో 8.30 కు వెళ్లాల్సి వచ్చిందట. ఆ సమయంలో పవన్ చాలా కోపంగా ఉన్నారట.. చేతిలో గన్ పట్టుకొని ఉన్నారు. ఏంటన్నాయా కథ నచ్చకపోతే కాల్చేస్తారా .? అని అడిగాను వెంటనే నవ్వి కామ్ అయ్యారు అని తెలిపాడు కరుణాకరన్. అలాగే ఈ మూవీలోని ఈ మనసే.. సాంగ్ ఎడిటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ రామానాయుడు స్టూడియోకి వచ్చారు. అయితే చివరి దశలో ఉంది కాసేపు వెయిట్ చేయండి అని నేను లోపలి వెళ్ళాను. కానీ ఎడిటిం అయ్యేసరికి చాలా లేట్ అయ్యింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు అది చూసి నేను షాక్ అయ్యాను.దాదాపు అక్కడే 6 గంటలు వెయిట్ చేశారు పవన్. ఆతర్వాత పాట విని ఎంతో సంతోషించారు అని తెలిపారు కరుణాకరన్

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...