అప్పుడు చిరును నమ్మి ఉంటే.. NTRకు అలా జరిగేది కాదేమో..!

Updated on: Aug 24, 2025 | 8:40 AM

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేక స్థానముంది. కేవలం తన నటనతోనే కాకుండా డ్యాన్స్‌లతో సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసేశారు చిరంజీవి. 150 కు పైగా సినిమాలు చేసిన చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. వాల్తేరు వీరయ్య దర్శకుడు కే.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలలతోనూ మెగాస్టార్ ప్రాజెక్టులు ఫిక్స్ అయ్యాయి.

ఇక చిరంజీవి రిజెక్ట్ చేసిన కొన్ని కథలతో ఇతర హీరోలు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్లు కొట్టారు. మరికొందరు బోల్తా పడ్డారు. చిరంజీవి, ఎన్టీఆర్ ల విషయంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో తారక్ ఓ సినిమా చేశాడు. రిలీజ్ కు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఆ మూవీ తీరా రిలీజయ్యాక భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్‌ను విమర్శల పాలు చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏదనుకుంటున్నారా? పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా. అప్పట్లో ఈ సినిమా క్రేజ్ మాములుగా లేదు. కేవలం మూవీ ఆడియో ఫంక్షన్ కే లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. అప్పుడే కాదు ఇప్పటికీ ఈ రికార్డు అలాగే ఉంది. ఇలా ఎన్నో అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఆంధ్రావాలా ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా కథను మొదట చిరంజీవికే చెప్పారట పూరి జగన్నాథ్. అప్పటికే మెగాస్టార్ చేతిలో పలు సినిమాలు ఉండడం.. స్టోరీలో కొత్తదనం లేదని చిరు ఫీలవడంతో.. పూరి సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదట. దీంతో డైరెక్టర్ పూరీ ఎన్టీఆర్ కు ఆంద్రావాలా కథ చెప్పి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించారు. అయితే సెకండాఫ్‌లో వచ్చే పెద్దాయన క్యారెక్టర్‌కు ఎన్టీఆర్‌ సూట్ అవ్వలేదని అప్పట్లో అందరూ పెదవి విరిచారు. ఆ కారణంగానే సినిమా డిజాస్టర్ అయినట్టు అప్పట్లో టాక్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

12 ఏళ్ల కూతురురే నటి రెండో పెళ్లికి పెళ్లి పెద్ద

కలుపు తీద్దామని పొలానికి వెళ్తే.. లక్ష్మీ దేవి తలుపు తట్టింది

బన్నీకే మొదటి ప్రాధాన్యత దీపిక నిర్ణయంతో.. బాలీవుడ్‌ మేకర్స్‌ షాక్‌

పాపం! ఆ సినిమా కూడా చేసుంటే.. ఈ బేబీ ఎక్కడికో వెళ్లిపోయేదిగా..

ఈ అరవ ప్రేమకథ ఎలా ఉంది? హిట్టా..? ఫట్టా..?