Thalapathy Vijay: రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసిన లియో.! షాక్ ఇస్తున్న ప్రీరిలీజ్ బిజినెస్.

|

Jul 02, 2023 | 11:32 AM

దళపతి విజయ్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో లియో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.

దళపతి విజయ్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో లియో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు లోకేష్ కానగరాజ్. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇక ఇప్పుడు లియో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ లో తెగ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని తెలుస్తోంది. రిలీజ్ కు ముందే వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందట ఈ సినిమా.

లియో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 400 కోట్ల వరకు జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దళపతి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఆయన సినిమాలు వంద కోట్ల వసూల్ ను అవలీలగా రాబడతాయి. తుపాకీ సినిమా నుంచి విజయ్ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక లియో సినిమాతో మరో బంపర్ హిట్ కొట్టడం ఖాయం అని తెలుస్తోంది. శాటిలైట్ డిజిటల్ అండ్ మ్యూజిక్ రైట్స్ దాదాపుగా రూ.220 కోట్లకు వరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. రిలీజ్ కు ముందే లియో ఎంత వసూల్ చేస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..