Dhurandhar: ధురంధర్ కలెక్షన్స్‌లో షేర్ కావాలి! పాకిస్తానీల వింత డిమాండ్

Updated on: Dec 24, 2025 | 1:27 PM

భారతీయ సినిమాలను ఆదరిస్తున్న పాకిస్తానీలు, 'ధురంధర్' సినిమాపై వింత డిమాండ్‌తో వార్తల్లో నిలిచారు. కరాచీలోని లయరీ ప్రాంత బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ సినిమా రూ.1000 కోట్లకు చేరువ అవుతుండటంతో, లయరీ ప్రజలు తమకు కలెక్షన్లలో వాటా కావాలని కోరుతున్నారు. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇండియన్ సినిమాలకు తెగ అలవాడు పడిన పాకిస్తానీలు.. ఈమధ్య మన సినిమాలను ఓపెన్‌గా చూస్తున్న వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలా మన ధురంధర్ మూవీని కూడా ఓపెన్ మార్కెట్లో చూస్తున్న కొందరు పాకిస్తానీలు… మన మేకర్స్‌కో వింత డిమాండ్‌ చేశారు. ధరుంధర్ కలెక్షన్స్‌లో మాకూ షేర్ కావాలంటూ.. ఓ వీడియోలో చెప్పారు. ఆ వీడియోతో మరో సారి హాట్ టాపిక్ అవుతున్నారు పాకిస్తానీలు. ఇక అసలు విషయంలోని వెళితే.. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టైన ‘ధురంధర్’ మూవీని పాకిస్థాన్ కరాచీలోని ‘లయరీ’ అనే ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో తీశారు. 1990ల్లో అక్కడ జరిగిన గ్యాంగ్ వార్స్‌కి ఓ కల్పిత కథ జోడించి దర్శకుడు ఆదిత్య ధర్ ఈ మూవీ తెరకెక్కించాడు. అయితే ప్రస్తుతం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌కి చేరువలో ఈ సినిమా కలెక్షన్స్‌లలో.. తమకు షేర్ ఇవ్వాలని ఇప్పుడు లయరీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోలో లయరీకి చెందిన పలువురు వ్యక్తులు మాట్లాడారు. తమ ప్రాంతాన్ని సినిమాలో చూపించారు కాబట్టి వసూళ్లలో ఎందుకు వాటా ఇవ్వకూడదు? అని అన్నాడు. మరో వ్యక్తి అయితే ఏకంగా 80 శాతం కలెక్షన్స్ తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మొత్తం ఇవ్వడం వల్ల దర్శకుడికి పెద్దగా పోయేదేం ఉండదని, తర్వాత కూడా ఎలానూ సినిమాల చేస్తాడు కదా అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు

Champion: రిలీజ్‌కు ముందే ఛాంపియన్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్

చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

రైలు ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఛార్జీలు

మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు