దేవర 2లో ఆ స్టార్ హీరో.. ఫ్యాన్స్‌కు పండగే..!

Updated on: Oct 03, 2025 | 11:12 AM

ఎంతసేపూ సెట్స్‌పై ఉన్న ప్రశాంత్ నీల్ డ్రాగన్, నెక్ట్స్ చేయబోయే త్రివిక్రమ్ సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు గానీ.. ఎన్టీఆర్ దేవర 2 సినిమా బాకీ ఉన్నారని గుర్తుందా..? మిగిలిన సినిమాల ధ్యాసలో దీనిపై పెద్దగా చర్చ జరగట్లేదు ఈ మధ్య. కానీ ఎవరూ ఊహించని స్థాయిలో దేవర 2 డిజైన్ చేస్తున్నారు కొరటాల.

మరి ఆ ముచ్చట్లేంటి.. దేవర 2 సెట్స్‌పైకి వచ్చేదెప్పుడు..? వార్ 2 నిరాశ పరచడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలన్నీ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాపైనే ఉన్నాయి. మొన్న యాడ్‌ షూట్‌లో గాయమవ్వడంతో రెస్ట్ మోడ్‌లో ఉన్నారు తారక్. నవంబర్‌లో మళ్లీ ప్రశాంత్ నీల్ సెట్స్‌లో జాయిన్ కానున్నారీయన. ఈ చిత్ర షూటింగ్ జనవరి నాటికి పూర్తి కానుందని తెలుస్తుంది. జూన్ 26, 2026కి దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మరోవైపు దేవర 2 స్క్రిప్ట్ పూర్తి చేసారు కొరటాల శివ. 2026 సమ్మర్ నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. అన్నీ కుదిర్తే 2027 పొంగల్ కానుకగా దేవర 2ను విడుదల చేయాలనేది కొరటాల ప్లాన్. సీక్వెల్‌లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా పరిచయం చేయాలని చూస్తున్నారు మేకర్స్. గతంలో పుష్ప 2, కేజియఫ్ 2లలో కథకు అనుగుణంగా కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి.. విడుదలకు సిద్ధంగా ఉన్న కాంతార ఛాప్టర్ 1లోనూ కొత్త పాత్రలు చాలానే ఉన్నాయి. అలాగే దేవర 2లో ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం తమిళ హీరో శింబును ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. దేవర 2లో తండ్రి కథ ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంక్రాంతి ప్లానింగ్ నెక్ట్స్ లెవల్.. నవ్వి నవ్వి పోతారు

Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..

దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే

రూ.50 కోట్ల బీమా కోసం ఎంతకు తెగించాడంటే.. భార్య, తల్లిదండ్రుల హత్య

సంక్రాంతి ఫైట్‌.. ఫైనల్‌ లిస్ట్‌లో ఆ నలుగురు