మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. ఏంది మావా ఇది

|

Apr 24, 2024 | 5:34 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సెలబ్రిటీలు తమకు ప్రచారం చేస్తున్నారంటూ డీప్‌ఫేక్‌ వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇలాంటి ట్రిక్స్ చేస్తున్నారు. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరపున అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్న ఓ డీప్ ఫేక్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సెలబ్రిటీలు తమకు ప్రచారం చేస్తున్నారంటూ డీప్‌ఫేక్‌ వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇలాంటి ట్రిక్స్ చేస్తున్నారు. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరపున అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్న ఓ డీప్ ఫేక్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఏఐ-ఆధారిత టెక్నాలజీతో రూపొందించిన ఈ వీడియోను చూసిన వారెవరైనా అల్లు అర్జున్ నిజంగానే కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం చేస్తున్నారని నమ్మడం ఖాయం అన్నట్టుగా ఉంది ఆ వీడియో. వీడియోలో ఏముందంటే..అల్లు అర్జున్ ఓపెన్-టాప్ కారులో నిలబడినట్టు వీడియోను రూపొందించారు. అలా నిల్చొని ప్రజల వైపు చూస్తూ, నవ్వుతూ చేతులు ఊపుతున్నట్టు క్రియేట్‌ చేశారు. అంతేకాదు, పక్కనే ఆయన భార్య స్నేహారెడ్డి కూడా ఉన్నట్టు సృష్టించారు. కాంగ్రెస్ గౌరవం కోసం అల్లు అర్జున్ బరిలో నిలిచారు అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇండియాలోనే అతిపెద్ద సూపర్‌స్టార్ అల్లు అర్జున్.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని మరో వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మానేరు వాగుపై 2016లో ప్రారంభమైన వంతెన నిర్మాణం.. అప్పుడే కుప్పకూలిందిగా