ఓవైపు జైల్లో భర్త.. మరోవైపు వేధింపులు.. దారుణంగా దర్శన్ భార్య పరిస్థితి

Updated on: Jan 07, 2026 | 5:17 PM

దర్శన్ భార్య విజయలక్ష్మి తీవ్ర ఆన్‌లైన్ వేధింపులు, మార్ఫింగ్ ఫోటోలతో సతమతమవుతున్నారు. ఈ సైబర్ బెదిరింపులు పెరగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎదుర్కొన్న విజయలక్ష్మి, ఇప్పుడు వేధింపుల తీవ్రత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ మహిళలకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని ప్రశ్నిస్తూ, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఓ పక్క తన భర్త దర్శన్ జైల్లో.. మరో పక్క సోషల్ మీడియాలో తీవ్ర వేధింపులు.. వెరసి ఒత్తిడికి లోనవుతున్న దర్శన్ భార్య రీసెంట్‌గా మరో సారి తనను వేధిస్తున్న వారిపై సీరియస్ అయ్యారు. ఆన్‌లైన్‌ వేధింపులు తీవ్రతరం కావడంతో.. ఇటీవలే దర్శన్ భార్య విజయలక్ష్మి పోలీసులను ఆశ్రియించారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆన్‌లైన్‌లో ట్రోలింగ్స్‌ ఎదుర్కోవడం తనకు ఇదేం మొదటిసారి కాదని చెప్పారు. నాలుగేళ్ల క్రితం తన ఫోటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నా అన్నారు. కానీ, ఈసారి వేధింపుల తీవ్రత మరింత పెరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. కొందరు హద్దులు దాటుతూ ప్రవర్తిస్తున్నారని.. ఇలాంటి హీనమైన చర్యలను ఏమాత్రం సహించకూడదన్నారు విజయలక్ష్మి. తనకే ఇలా జరుగుతుంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఆమె.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Thalapathy Vijay: బాలయ్య దెబ్బకు.. షాక్‌లోకి విజయ్‌ !! ట్రెండింగ్‌లో నటసింహం

Jabardasth Naresh: జబర్దస్త్ నరేష్ పెళ్లి పేరుతో ప్రచారం.. మళ్ళీ మొదటికొచ్చిన ప్రయత్నాలు

ఈవెంట్‌లో సీనియర్ నటికి పూనకం.. వైరల్ వీడియో

మెస్సీ Vs రొనాల్డో ‘వెయ్యి గోల్స్’ మొనగాడు ఎవరు ??

గోదావరిలో పడవలతో చిరంజీవి పేరు.. ఆకట్టుకున్న దృశ్యం