CM రిక్వెస్ట్ తో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి వెళ్లిన మెగాస్టార్
దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. తెలంగాణను ప్రపంచ వేదికపై నిలబెట్టాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. చిరంజీవి ఆహ్వానాన్ని మన్నించి సమ్మిట్‌లో పాల్గొని, డాక్యుమెంటరీని వీక్షించారు. వారి అనుబంధం, తెలంగాణ భవిష్యత్తు విజన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రేవంత్ రెడ్డి! ఓపక్క సీఎంగా తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందిస్తూనే.. మరో పక్క అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ పేరు వినబడేలా చేస్తున్నారు.ఈ క్రమంలోనే దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. అయితే ఇందుకోసం మెగాస్టార్ చిరును కూడా సీఎం రేవంత్ ఇన్‌వైట్ చేయడం.. చిరు వెళ్లి రేవంత్ రెడ్డి సమేతంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటరీని చూడడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కోసం స్విస్‌లోని దావోస్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డికి.. చిరు కూడా స్విట్జర్లాండ్‌లో ఉన్నాడని తెలియడంతో.. ఆయన్ను కూడా సమ్మిట్‌కు ఇన్‌వైట్ చేశారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ సమ్మిట్‌కు హాజరైన చిరు.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్ను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా ఆహ్వానించారు. తమ కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లతో కలిసి “మన శంకరవరప్రసాద్ గారు” సినిమాను వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని ముఖ్యమంత్రి చెప్పారు. సీఎం రేవంత్ పాలన చేస్తూనే.. పలు రంగాల్లోని ప్రముఖులతో కూడా సన్నిహితంగా ఉంటుంటారు. అందులో టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరుతో మంచి బాండింగ్ మెయిన్‌టేన్ చేస్తుంటారు. చిరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ.. ప్రభుత్వం నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ మేరకు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు వెళ్లారు మెగాస్టార్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నా ఫోటోలు జూమ్ చేసి చూశారు’ హీరోయిన్ ఎమోషనల్
కోహ్లి తాగిన ఆ డ్రింక్ ఖరీదెంతో తెలిస్తే మైండ్ బ్లాక్
ఐసీసీ అల్టిమేటంపై బంగ్లాదేశ్ రియాక్షన్
గుండె జబ్బులు మౌనంగా మృత్యుఘంట.. అసలు కారణాలేంటి.. ఎలా తగ్గించుకోవచ్చు
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై బిగ్ అప్డేట్..! వీడియో రిలీజ్ చేసిన అశ్విని వైష్ణవ్
