జనసేనకు చిరంజీవి భారీ విరాళం.. మెగాస్టార్ పాదాలకు నమస్కరించిన పవన్

పవన్ కల్యాణ్‌తో పాటు ముచ్చింతల్‌ లొకేషన్‌కి మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా వెళ్లారు.  జనసేన, పవన్ అభ్యన్నతిని ఆకాంక్షిస్తూ చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే విశ్వంభర మూవీ గురించి చిరంజీవిని అడిగి తెలుసుకున్నారు పవన్.. అటు చిరంజీవి కూడా జనసేన స్థితిగతులపై ఆరా తీశారు.

Updated on: Apr 08, 2024 | 6:15 PM

జనసేనకు చిరంజీవి ఐదుకోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన  విశ్వంభర మూవీ షూటింగ్‌ లొకేషన్‌లో పవన్ కు చెక్  అందించారు చిరంజీవి. పవన్ కల్యాణ్‌తో పాటు ముచ్చింతల్‌ లొకేషన్‌కి మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా వెళ్లారు.  జనసేన, పవన్ అభ్యన్నతిని ఆకాంక్షిస్తూ చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే విశ్వంభర మూవీ గురించి చిరంజీవిని అడిగి తెలుసుకున్నారు పవన్.. అటు చిరంజీవి కూడా జనసేన స్థితిగతులపై ఆరా తీశారు. ఈ ముగ్గురు అన్నదమ్ముల మధ్య అరగంటపాటు మాటామంతి జరిగింది.