Chaitanya – Niharika: నిహారిక డివోర్స్ మాటలపై.. మాజీ భర్త షాకింగ్ కామెంట్స్.

|

Jan 27, 2024 | 3:33 PM

నిన్న మొన్నటి వరకు మెగా డాటర్ నిహారిక విడాకుల మ్యాటర్ చిన్న పాటి సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది. అందరికీ తెలిసీ తెలియనట్టుగా.. టాక్ నడిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల పై ఫస్ట్ టైం తనే క్లారిటీ ఇచ్చింది నిహారిక. విడాకుల తర్వాత ఎంతో బాధపడ్డానని..చాలా ఏడ్చానని చెప్పింది. తనది లవ్ మ్యారేజ్ కాదని.. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం వల్ల.. కొన్ని విషయాల్లో వర్కౌట్ కాక విడపోవాల్సి వచ్చిందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. మనుషులను నమ్మకూడదని కాస్త ఎమోషనల్ గా మాట్లాడింది. అయితే నిహారిక మాటలపై.. నిహారిక మాట్లాడిన ఈ షోపై..

నిన్న మొన్నటి వరకు మెగా డాటర్ నిహారిక విడాకుల మ్యాటర్ చిన్న పాటి సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది. అందరికీ తెలిసీ తెలియనట్టుగా.. టాక్ నడిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల పై ఫస్ట్ టైం తనే క్లారిటీ ఇచ్చింది నిహారిక. విడాకుల తర్వాత ఎంతో బాధపడ్డానని..చాలా ఏడ్చానని చెప్పింది. తనది లవ్ మ్యారేజ్ కాదని.. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం వల్ల.. కొన్ని విషయాల్లో వర్కౌట్ కాక విడపోవాల్సి వచ్చిందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. మనుషులను నమ్మకూడదని కాస్త ఎమోషనల్ గా మాట్లాడింది. అయితే నిహారిక మాటలపై.. నిహారిక మాట్లాడిన ఈ షోపై.. ఇంటర్వ్యూయర్ పై.. నిహారిక ఎక్స్‌ హస్బెండ్ చైతన్య జొన్నలగడ్డ తాజాగా రియాక్టయ్యారు. ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట సెన్సేషనల్ అవుతోంది.

ఇంతకీ చైతన్య జొన్నల గడ్డ ఏం పోస్ట్ చేశాడంటే.. “వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదనే విషయం నాకు తెలుసు. కానీ పరోక్షంగా అందులో ఉన్న బాధితుల గురించి ట్యాగ్ చేయడం.. అందుకు ఇలాంటి ప్లాట్ ఫామ్స్ ఉపయోగించడం కూడా మానేయ్యాలి. ఇలా జరగడం ఇది రెండోసారి. రెండు వైపుల ఆ బాధ, కష్టం ఓకే విధంగా ఉంటుంది. విడాకుల గురించి మాట్లాడుకూడదు.. అందులోనూ ఒక వైపు మాత్రమే అసలు మాట్లాడకూడదు. అంతకంటే ఆ బాధ గురించి.. దాని నుంచి ఎలా బయటపడింది అనేది మాట్లాడితే ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే నమ్మకం లాంటి వాటి గురించి మాట్లాడాలంటే ఆ సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి. కానీ ఏమి తెలియకుండా ప్రజలు ఒకవైపు జడ్జి చేసి కామెంట్స్ చేయడం పూర్తిగా ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్ ఫామ్స్ ఉపయోగించి ప్రజలకు ఒకవైపు జరిగింది మాత్రమే చెప్పడం కూడా అంతే తప్పు. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం చైతన్య చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos