భారీ వసూళ్లు సాధిస్తున్న మూవీ.. ఈ నెంబర్స్‌తో ఆ సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతున్నాయా.?

Edited By: Phani CH

Updated on: Oct 13, 2025 | 4:11 PM

మన సినిమాలు వందలకోట్ల వసూళ్లను ఈజీగా సాధించేస్తున్నాయి. మాస్ కమర్షియల్‌ స్టార్ సినిమా అయితే తొలి రోజే వంద కోట్లు కొల్లగొట్టేస్తుంది. ఈ బాక్సాఫీస్‌ నెంబర్స్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ కిక్కిస్తున్నాయి. మరి ఈ నెంబర్స్‌తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీయేనా? అసలు బిగ్ నెంబర్సే సక్సెస్‌కు క్రైటీరియానా..? రీసెంట్‌ టైమ్స్‌లో పాన్ ఇండియా సినిమాల కలెక్షన్‌ నెంబర్స్‌ భారీగా కనిపిస్తున్నాయి.

లాంగ్వేజ్‌, జానర్‌తో సంబంధం లేకుండా చాలా సినిమాలు మూడు నాలుగు వందల కోట్లకు పైనే కలెక్షన్లు సాధిస్తున్నాయి. కాస్త పాజిటివ్‌ టాక్ వచ్చిన సినిమాలైతే నాలుగైదు వంద కోట్ల మార్క్‌ను కూడా క్రాస్ చేసేస్తున్నాయి. ఈ రేంజ్‌లో కలెక్షన్‌ నెంబర్స్ కనిపిస్తున్నా… ఆ సినిమాలు లాభాలు సాధిస్తున్నాయా అంటే అనుమానంగానే ఉంది. భారీ బడ్జెట్‌తో సినిమాలు రూపొందిస్తున్న మేకర్స్‌, ఆ సినిమాలను ఒక్కో ఏరియా వందల కోట్లకు అమ్ముతున్నారు. దీంతో ఒకటి రెండో చోట్ల భారీ వసూళ్లు సాధించినా… చాలా చోట్ల ఆశించిన స్థాయిలో కలెక్షన్ నెంబర్స్ కనిపించటం లేదు. ముఖ్యంగా టికెట్‌ రేట్స్ పెంచుకునే అవకాశం వచ్చిన చోట తొలి వారం భారీ వసూళ్లు కనిపిస్తున్నా… లాంగ్ రన్ మాత్రం ఉండటం లేదు. నెంబర్స్ పరంగా భారీ వసూళ్లు సాధించిన సినిమాలు కూడా లాంగ్ రన్‌లో సూపర్ హిట్ రేంజ్‌కు రాలేకపోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. కొన్ని సినిమాలు వందల కోట్ల క్లబ్‌లో కనిపిస్తున్నా… బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో సినిమా సక్సెస్‌ను ఎలా చూడాలి అన్నది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌గా మిగిలిపోతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

SS Rajamouli: ఇండియా నెం.1 డైరెక్టర్‌గా.. రాజమౌళికి మాత్రమే ఎలా సాధ్యం

Chandrababu Naidu: హైదరాబాద్ ను మించిన రాజధాని నిర్మించాలన్నదే లక్ష్యం

Tirupati: SV వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం

Pedda Amberpet: పెద్ద అంబర్‌పేట్ లో దొంగల బీభత్సం

Bihar Politics: బిహార్‌ ఎన్నికల ప్రచార రంగంలోకి ప్రధాని మోదీ