చిక్కుల్లో యోగి బయోపిక్.. సంచలనంగా హైకోర్టు తీర్పు!

Updated on: Jul 17, 2025 | 8:45 PM

ఇటీవల రాజకీయ నాయకుల జీవితాల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు పెద్ద సంఖ్యలో తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే మోదీ, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్, వాజ్‌పేయి, బాల్ థాకరే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మన్మోహన్ సింగ్ ఇలా పలువురు నేతలపై సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కోవలోనే.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా ఒక సినిమా తెరకెక్కింది.

అయితే ఈ సినిమా విడుదల విషయంలో పలు చిక్కులు ఎదురవుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి’. ఈ చిత్రాన్ని ‘ది మాంక్ హూ బికమ్ చీఫ్ మినిస్టర్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందించారు. డైరెక్టర్ రవింద్ర గౌతమ్ తెరకెక్కించిన ఈ చిత్రం తాలూకూ పోస్టర్ ఇప్పటికే ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా ఆగస్టు 1న విడుదలకు రెడీగా ఉంది. అయితే, సెన్సార్ బోర్డ్‌ నుంచి ఈ మూవీ రిలీజ్ కి కొత్త సమస్య వచ్చి పడింది. ‘అజయ్’ చిత్రానికి ఆమోదం తెలిపేందుకు సెన్సార్ బోర్డ్ నిరాకరించింది. దీనిపై, చిత్ర నిర్మాతలు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తమ చిత్రం విషయంలో సెన్సార్ బోర్డ్ వైఖరిని వారు కోర్టుకు వివరించారు. కావాలనే.. బోర్డ్ సినిమాకు ఆమోదం తెలపకుండా.. లేట్ చేస్తోందని వారు ఆరోపించారు. దీంతో, సెన్సార్ బోర్డుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆలస్యానికి గల కారణాలను వివరించాలని సెన్సార్ బోర్డును కోర్టు ఆదేశించింది. శంతను గుప్తా రాసిన ‘ది మాంక్ హూ బికమ్ చీఫ్ మినిస్టర్’ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో.. అనంత్ విజయ్ జోషి.. యోగి ఆదిత్యనాథ్ పాత్రను పోషించారు. భోజ్‌పురి సినీ నటుడు నిర్హువా, పాన్ ఇండియా నటుడు పరేష్ రావల్, రాజేష్ ఖట్టర్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించారు. ఇందులో ఆదిత్యనాథ్ బాల్యం నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన ఘట్టాలను తెరకెక్కించారు. రీతు మెంగి నిర్మించిన ఈ చిత్రానికి దిలీప్ బచ్చన్, దిలీప్ మెంగి స్క్రీన్‌ప్లే సమకూర్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు షాక్ రాజాసాబ్ రిలీజ్ పోస్ట్‌ పోన్?

చిరంజీవి వినతిని పట్టించుకోని GHMC.. ఊహించని షాకిచ్చిన మెగాస్టార్

మహేష్‌ సినిమా కోసం నన్ను అందుకే వద్దనుకున్నారు..

బాబును హాలీవుడ్‌లో నిలబెట్టేందుకు జక్కన్న మాస్టర్ ప్లాన్స్

OTT హిస్టరీలోనే టెర్రిబుల్ సిరీస్.. దమ్ముంటేనే చూడండి