AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'ఆ ముఖం చూడండి.. అతడు రాముడేంటి?' స్టార్ నటుడి షాకింగ్ కామెంట్స్

‘ఆ ముఖం చూడండి.. అతడు రాముడేంటి?’ స్టార్ నటుడి షాకింగ్ కామెంట్స్

Phani CH
|

Updated on: Apr 07, 2026 | 5:55 PM

Share

బాలీవుడ్‌లో రూ. 4000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటించడంపై చర్చ జరుగుతోంది. రామాయణం సీరియల్ నటుడు సునీల్ లహరి (లక్ష్మణుడు) రణబీర్ కపూర్‌కు దైవిక అమాయకత్వం లేదని, రాముడి పాత్రకు సరిపోడని అభిప్రాయపడ్డారు. పవిత్రమైన పాత్రలను తెరపై చూపించేటప్పుడు ప్రేక్షకుల భావోద్వేగాలను గౌరవించాలని ఆయన సినిమా టీమ్‌కు సూచించారు.

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న రామాయణ సినిమాలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో తెలీదు కానీ.. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో అన్న విషయం మాత్రం ఇప్పుడు అందర్నీ నివ్వెర పోయేలా.. ముక్కు మీద వేలేసుకునేలా చేస్తోంది. ఇలాంటి రియాక్షన్ మధ్యలో.. ఈ మూవీ నుంచి రామా గ్లింప్స్‌ రిలీజ్ అయింది. అందర్నీ ఆకట్టుకుంటూనే.. మరో పక్క ఈ గ్లింప్స్‌లో రాముడిగా రణ్బీర్ కపూర్ సెట్టయ్యాడా? లేదా? అన్న చర్చను నెట్టింట రగిలించింది. ఈ చర్చలో భాగంగానే రామాయణం సీరియల్లో లక్ష్మణుడిగా నటించిన సునిల్ లహరి రణ్బీర్‌ రాముడిగా సెట్‌ అవ్వలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సునిల్ లహరి.. రాముడిగా రణబీర్ కపూర్ ను అంగీకరించలేకపోతున్నా అంటూ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. రణబీర్ కపూర్ మంచి నటుడే కానీ రాముడికి ఉండాల్సిన దైవికమైన అమాయకత్వం రణబీర్ లో లేదన్నాడు ఆయన. రణ్‌బీర్ ముఖంపై ఒక విధమైన మెచ్యూరిటీ కనిపిస్తోంది, అది రాముడి పాత్రకు సరిపోదని సునీల్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా మనం దేవుళ్లుగా ఆరాధించే పాత్రలను తెరపై చూపించేటప్పుడు, ప్రేక్షకుల భావోద్వేగాలను గౌరవించాలన్నాడు సునీల్. ప్రయోగాలు చేసే క్రమంలో ఆ పాత్రల మూలాలను దెబ్బతీయకూడదు చూసుకోవాలంటూ… రామాయణ మూవీ టీంకు సలహా ఇచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్‌ కాదు.. కొత్తగా ప్యాచప్‌..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్

Biker Collection: బాక్సాఫీస్‌ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్

Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట

Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక

Hyper Aadi: పబ్లిక్‌లో గొడవకు దిగిన.. హైపర్ ఆది

Follow Us