మేమే హీరోయిన్స్.. మేమే స్పెషల్ గాళ్స్.. కొత్త ట్రెండ్

Edited By:

Updated on: Jan 08, 2026 | 5:51 PM

సినిమా స్పెషల్ సాంగ్స్‌కు ప్రత్యేక హీరోయిన్లు అక్కర్లేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లే తమ సినిమాల్లో స్పెషల్ బ్యూటీస్‌గా మారిపోతున్నారు. రాజా సాబ్, పుష్ప, మిరాయ్ వంటి చిత్రాలతో పాటు రష్మిక, శ్రద్ధా కపూర్, కృతి సనన్ వంటి తారలు ఈ ట్రెండ్‌ను సృష్టించారు. గ్లామర్ షోతో పాటు బాక్స్ ఆఫీస్ విజయానికి ఇది కొత్త మార్గం.

ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కోసం స్పెషల్‌గా కొందరు హీరోయిన్లు ఉండేవాళ్లు.. కానీ ఇప్పుడా అవసరం లేదు. తమ సినిమా కోసం తామే స్పెషల్ బ్యూటీస్‌గా మారిపోతున్నారు స్టార్స్. మరీ ముఖ్యంగా ఓ ప్రొడక్షన్ హౌజ్ వాళ్ళ హీరోయిన్లతోనే స్పెషల్ సాంగ్స్ చేయిస్తున్నారు. తాజాగా రాజా సాబ్ బ్యూటీస్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు. నాచే నాచే సాంగ్‌తో బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అయిపోయింది రాజా సాబ్ సినిమా. ఈ పాట కోసం ప్రత్యేకంగా హీరోయిన్లను తీసుకురాకుండా.. సినిమాలోని బ్యూటీస్‌తోనే స్పెషల్ సాంగ్ చేయించారు మేకర్స్. పైగా ప్రభాస్ చాలా రోజుల తర్వాత చేసిన డాన్స్ నెంబర్ కావడంతో వైరల్ అవుతుంది నాచే నాచే సాంగ్. ఈ మధ్య హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. ఆ మధ్య థామా సినిమా కోసం రష్మిక మందన్న కూడా ఇలాగే స్పెషల్ సాంగ్ చేసారు. అందులో గ్లామర్ షో కూడా బాగానే చేసారు ఈ బ్యూటీ. సినిమా పోయినా.. ఈ పాట మాత్రం బాగా క్లిక్ అయింది. అందులో ఆయుష్మాన్‌తో కలిసి నటించారు రష్మిక. దానికి ముందు గుడ్ బైలో కూడా ఖతర్నాక్ స్పెషల్ సాంగ్ చేసారు రష్మిక. బాలీవుడ్‌లో తమ సినిమాల కోసం తామే స్పెషల్ బ్యూటీస్ అవుతున్నారు హీరోయిన్లు. ఇదే మ్యాడాక్ నుంచి వచ్చిన స్త్రీ 2 సినిమాలో శ్రద్ధా కపూర్ కూడా అదిరిపోయే స్పెషల్ సాంగ్ చేసారు. చివర్లో వచ్చే ఈ పాటకు రెస్పాన్స్ అదిరిపోయింది. స్త్రీ 2లో తమన్నా కూడా స్పెషల్ సాంగ్ చేసారు. భేడియా సినిమాలో కృతి సనన్ సైతం తుముకేశ్వరి అంటూ ఖతర్నాక్ మసాలా సాంగ్ చేసారు. ఈ పాట సినిమాకు బాగా హెల్ప్ అయింది. తెలుగులోనూ ఈ ట్రెండ్ మొదలైపోయింది. మొన్న మిరాయ్‌లో వైబ్ ఉంది పాట ఈ స్టైల్‌లోనే వచ్చింది. హీరోయిన్ రితికా నాయక్‌తోనే స్పెషల్ సాంగ్ చేయించారు మేకర్స్. మొత్తానికి ఇదో కొత్త ట్రెండిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్ ఇండియా ట్రెండ్‌కు దూరమవుతున్న బాలీవుడ్‌

Meenakshi Chaudhary: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి

హిట్ కొట్టాలంటే.. బ్రేక్ కావాల్సిందే అంటున్న క్రేజీ డైరెక్టర్స్‌

Janhvi Kapoor: సౌత్‌ కోసం తన ప్లాంనింగ్ మార్చుకున్న జాన్వీ కపూర్‌

తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే