Govinda: హీరో ఇంట్లో గన్ మిస్‌ ఫైర్.. ఆసుపత్రిలో గోవింద.! వీడియో వైరల్.

బాలీవుడ్ స్టార్ హీరో గోవింద ఇంట్లో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ ఒకటి తెల్లవారుజామున గోవిందా ఇంట్లో గన్ మిస్ ఫైర్ జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనలో హీరో గోవింద కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు అతడిని ముంబైలోని CRITI ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గోవింద ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Govinda: హీరో ఇంట్లో గన్ మిస్‌ ఫైర్.. ఆసుపత్రిలో గోవింద.! వీడియో వైరల్.

|

Updated on: Oct 02, 2024 | 10:22 AM

బాలీవుడ్ స్టార్ హీరో గోవింద ఇంట్లో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ ఒకటి తెల్లవారుజామున గోవిందా ఇంట్లో గన్ మిస్ ఫైర్ జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనలో హీరో గోవింద కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు అతడిని ముంబైలోని CRITI ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గోవింద ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఇక మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గోవింద తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నటుడు గోవిందకు పర్సనల్ రివాల్వర్ ఉంది. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు పని నిమిత్తం బయటకు వెళ్తుండగా అనూహ్యంగా గన్ మిస్ ఫైర్ జరిగినట్లు సమాచారం. రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో నటుడి మోకాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదం గురించి గోవింద మేనేజర్ నుంచి ఓ అఫీషియల్ ప్రకటన బయటికి వచ్చింది. కానీ పోలీసుల నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us