బిగ్‌బాస్‌లోకి దివ్వల మాధురి.. అందుకే భర్తతో విడిపోయా

Updated on: Oct 15, 2025 | 7:05 PM

బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఎంట్రీకి సంబంధించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఆ వార్తలను నిజం చేస్తూ ఆదివారం వైల్డ్ కార్డ్స్ ద్వారా దివ్వెల మాధురీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌజ్‌లోకి వచ్చిన దివ్వెల మాధురి తన నేపథ్యాన్ని, మనసులోని ఆలోచనలను బయటపెట్టింది. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులను చెబుతూ మాధురి ఎమోషనల్ అయ్యింది.

‘ఇంటర్మీడియట్ లో ఉండగానే నాకు పెళ్లయిపోయింది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు.కానీ మొదటి నుంచి భర్తతో నాకు అండర్ స్టాండింగ్ తక్కువ. అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేశాను. కానీ కుదర్లేదు. అందుకే మా ఆయనతో విడిపోవాల్సి వచ్చింది. గత నాలుగేళ్ల నుంచి మాత్రం శ్రీనివాస్ అంటే మాధురి, మాధురి అంటే శ్రీనివాస్‌గా జీవిస్తున్నాం. కానీ ప్రతిరోజూ సోషల్ మీడియాలో నా గురించి వస్తున్న కామెంట్స్ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది’ అని వెల్లడించింది. జీవితంలో చాలా నెగెటివిటీని చూశానని, మొత్తం సమాజం ఒక వైపు… తాను మరోవైపు అన్నట్లుగా గత కొన్నేళ్లుగా తన జీవితం సాగిందని చెప్పుకొచ్చింది. తన గురించి అందరికీ నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే తాను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నానని కూడా కుండబద్దలు కొట్టింది మాధురి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎవరు బెస్ట్ అని నాగార్జున.. మాధురిని ప్రశ్నించగా ఇమ్మాన్యుయేల్ బెస్ట్ అని సమాధానం ఇచ్చింది. ఇక మిగిలిన వాళ్లందరూ మాస్క్‌లు పెట్టుకుని ఉంటున్నారని చురకలు అంటించింది. తనపై ఉన్న నెగెటివిటీని పోగొట్టుకోవడానికే బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నానని మాధురి చెప్పుకొచ్చింది. మరి ఆమె లక్ష్యం ఏ మేర నెరవేరుతుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చుక్కలు చూపించనున్న చలి20 డిగ్రీలకు పడిపోనున్న టెంపరేచర్

అర్ధరాత్రి దొంగల బీభత్సంఆ ఇళ్లే టార్గెట్‌

తండ్రి ఆశయం కోసం IPS సాధించిన ఫారిన్ విద్యార్థిని

మహావతార్‌లాగే.. కురుక్షేత్ర మూవీ OTTలో తప్పక చూడాల్సిందే

Srija: ఆయనే అలా చేస్తే ఎలా ?? సోషల్ మీడియాలో చర్చ