బిగ్ బాస్‌ హౌస్‌లో వేధింపులు.. మహిళా కమిషన్‌ సీరియస్‌

Updated on: Nov 22, 2025 | 1:19 PM

బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్ వరుస వివాదాలతో సతమతమవుతోంది. కంటెస్టెంట్ గిల్లిపై మహిళలను వేధించారంటూ వచ్చిన ఆరోపణలపై పోలీసులు, మహిళా కమిషన్ దర్యాప్తు చేపట్టాయి. గతంలో షో పర్యావరణానికి హాని చేసిందనే కారణంతో నిలిపివేయాలని నోటీసులు వచ్చాయి. ఈ తాజా వివాదం శాండిల్ వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది, బిగ్ బాస్ నిర్వాహకులపై ఒత్తిడి పెరుగుతోంది.

బిగ్ బాస్ కన్నడ షో ఈసారి వరుస వివాదాను ఎదుర్కొంటోంది. షో వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందంటూ ఆ మధ్యన కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. వెంటనే రియాలిటీ షో ను నిలిపివేయాలంటూ ఆదేశాలిచ్చింది. ఎలాగోలా ఈ వివాదం సమసిపోయింది. ఇప్పుడు ఈ రియాలిటీషో మరో వివాదంలో చిక్కుకుంది. బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 కంటెస్టెంట్‌ గిల్లి హౌస్‌లో ఉన్న అమ్మాయిలను వేధిస్తున్నాడంటూ.. ప్రముఖ ఆర్టిస్ట్ HC కుషాల అతనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేయడమే కాదు.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌ గిల్లిపై అటు పోలీసులకు ఇటు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం కాస్తా ఇప్పుడు శాండిల్ వుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక కుషాల ఆరోపణలను ఫిర్యాదును కాస్త సీరియస్‌గా తీసుకున్న మహిళా కమిషన్‌.. ఇదే విషయంగా బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… గిల్లి బిహేవియర్‌ పై.. బిగ్ బాస్‌ టీంతో ఆరాతీస్తున్నట్టు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోతికి దశదిన కర్మ.. 4 వేల మందికి భోజనాలు !

ఎరక్కపోయి వెళ్లి.. ఇరుక్కుపోవడమంటే ఇదే

Top 9 ET: విజిల్ కొట్టేందుకు రెడీయా.. | బంగారు బిడ్డకు.. నాన్న నుంచి క్యూట్ విషెస్‌

అది నాలుకా తాటిమట్టా.. తనూజపై దారుణ ట్రోల్స్

బ్యాంకు కస్టమర్స్‌కు అలర్ట్.. ఆ నెంబర్ సిరీస్ నుంచి కాల్ వస్తేనే సేఫ్