పచ్చళ్ల పాపా.. మజాకా దెబ్బకు నోరెళ్లబెట్టిన నాగ్ వీడియో
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల తీరుపై నాగార్జున క్లాస్ తీసుకున్నారు. ఈ క్రమంలో పచ్చళ్ల పాప రమ్య, పవన్ తన బుజ్జి తమ్ముడు అని అనడం నాగార్జునతో పాటు హౌస్‌మేట్స్‌ను షాక్‌కు గురి చేసింది. వైల్డ్ కార్డ్‌ల అరాచకం, నాగార్జున స్పందన ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరాహోరీగా సాగుతోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ప్రవేశించడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. గత వారం వైల్డ్ కార్డ్‌లు సృష్టించిన రచ్చపై నాగార్జున ఈ వారం క్లాస్ తీసుకుంటారని ప్రేక్షకులు ఆశించారు. ప్రోమోల ద్వారా నాగార్జున గట్టిగానే స్పందించినట్లు తెలుస్తోంది. శనివారం విడుదలైన ప్రోమోలలో వైల్డ్ కార్డ్‌ల పొగరును దించిన నాగార్జున, హౌస్‌లో ప్రేమ కథలు, బాండింగ్స్‌పై కూడా మాట్లాడారు. ఈ ఎపిసోడ్‌లో పచ్చళ్ల పాప రమ్య చేసిన వ్యాఖ్యలు నాగార్జునను ఆశ్చర్యపరిచాయి.
మరిన్ని వీడియోల కోసం :
