యాడ దొరికిన సంతరా అయ్యా..బొట్టు బిళ్లల కోసం లొల్లేంట్రా

Updated on: Oct 16, 2025 | 4:52 PM

బిగ్ బాస్ సీజన్ 9లో రచ్చ రచ్చ జరుగుతోంది. కొత్త కంటెస్టెంట్స్ వచ్చి పాత కంటెస్టెంట్స్ కు చుక్కలు చూపిస్తున్నారు. అందులోనూ ది్వ్వెల మాధురి అయితే.. తన నోటికి ఓ రేంజ్‌లో పని చెబుతోంది. అవసరం ఉన్నా లేకపోయినా.. తన వెటకారం మాటలతో సీనియర్ కంటెస్టెంట్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌ ఎపిసోడ్‌లో ఆమె సంజనతో గొడవకు దిగడం.. బీబీ హౌస్‌ను ఊపేసింది.

సోషల్ మీడియాలో కొందరు నెటిజన్ల నుంచి క్రేజీ కామెంట్స్‌కు వచ్చేలా చేసుకుంటోంది. రీసెంట్‌ ఎపిసోడ్‌లో.. సంజన, మాధురి మధ్య బొట్టుపిల్లల కారణంగా పెద్ద గొడవ జరిగింది. బాత్రూంలో పెట్టిన తన స్టిక్కర్స్‌ కనిపించడంలేదంటూ మాధురి కిచెన్ దగ్గర అందర్నీ ఆరా తీస్తుండగా.. ఆ స్టిక్కర్స్‌ గురించి సంజన తనతో చెప్పిందని ఇమ్మూ మాధురితో చెబుతాడు. ఈ క్రమంలోనే సీన్లోకి ఎంటర్ అయిన సంజన.. తాను తీయలేదని.. కావాలంటే తన బొట్టు పిల్లలను వాడడండి అంటూ చెప్పింది. దాంతో పాటే డిసిప్లిన్ లేకుండా స్టిక్కర్స్ అలా ఎలా బాత్రూంలో పెడతా అంటూ మాధురిని నిలదీసింది. దీంతో మాధురి ఒక్క సారిగా తన నోటికి పని చెప్పింది. ఏంటి కామెడీగా ఉందా.. అప్పుడు గుడ్డు దొంగతనం చేసినట్టు.. నా స్టిక్కర్స్ దొంగతనం చేశావా..! దొంగతంన చేస్తే నేను ఊరుకోవాలా అంటూ… గట్టి గట్టిగా అరిచింది. దీంతో సంజన బిత్తర పోయింది. అంతేకాదు ఇలా దొంగ దొంగ చేస్తున్నావ్‌ కనుకే బిగ్ బాస్‌ నీ మెడలో దొంగ అనే బోర్డ్ వేశాడంటూ.. ఫైర్ అయింది. ఇలా తన వెటకారపు మాటలతో.. బీబీని ఊగిపోయేలా చేసింది. ఇక ఇదంతా చూస్తున్న రిమైనింగ్ హౌస్‌లోని సభ్యులు కళ్లు తేలేశారు. అప్పటికే మాధురితో పడని దివ్య అయితే మెంటల్ గాళ్లందూ ఇక్కడే ఉన్నారంటూ సైలెంట్‌గా కళ్యాణ్‌ దగ్గర ఓ పంచ్‌ వేసింది. ఇక ఈ ఎపిసోడ్‌ చూసిన బీ బీ ఆడియన్స్‌తో పాటు… నెటిజన్స్‌కూడా సంజన, మాధురి మధ్య సాగిన బొట్టు పిల్లల వార్‌ పై క్రేజీ రియాక్టవుతున్నారు. యాడ దొరికిన సంతరా ఇది.. బొట్టు పిల్లలకోసం ఈ లొల్లి ఏందంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అతనితో ప్రేమలో ఉన్నా.. కానీ పెళ్లి మాత్రం చేసుకోను

కొత్త పెళ్లికొడుకుకి ఎన్టీఆర్ స్పెషల్ సర్‌ప్రైజ్‌

అంత అమాయకురాలినేం కాదు.. దీపిక తీరుపై మాజీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్

హీరోయిన్‌కు వింత రోగం.. చెప్పుకోలేక.. భరించలేక తీవ్ర ఇబ్బంది

Published on: Oct 16, 2025 03:07 PM