Nainika: ఉన్నది 5 వారాలే కానీ.. డబ్బులు మాత్రం భారీగానే పట్టేసింది.!

|

Oct 09, 2024 | 4:20 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 8లో మరో వారం పూర్తయ్యింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా ఐదు వారాల్లో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఐదో వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండడంతో ఆదిత్య ఓం బయటకు వెళ్లిపోయాడు. ఇక వీకెండ్ లో పొట్టి పిల్ల, ఢీ ఫేమ్ నైనిక ఎలిమినేట్ అయ్యింది. షో ప్రారంభంలో నైనిక ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించింది.

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 8లో మరో వారం పూర్తయ్యింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా ఐదు వారాల్లో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఐదో వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండడంతో ఆదిత్య ఓం బయటకు వెళ్లిపోయాడు. ఇక వీకెండ్ లో పొట్టి పిల్ల, ఢీ ఫేమ్ నైనిక ఎలిమినేట్ అయ్యింది. షో ప్రారంభంలో నైనిక ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించింది. టాస్కుల్లో యాక్టివ్ గా పార్టి సిపేట్ చేసింది. ముఖ్యంగా క్లాన్‌ (టీమ్‌) లీడర్‌గా ఎదిగేందుకు నైనిక ఆడిన గేమ్ బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. హౌస్ లో అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చిన ఏకైక కంటెస్టెంట్ గా కనిపించిన నైనిక.. ఆ తర్వాత ఎందుకో పూర్తిగా స్లో అయిపోయింది. క్లాన్‌ చీఫ్‌గా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఆటలోనూ నిరుత్సాహపరిచింది. స్నేహితులతో ముచ్చట్లు పెట్టడం తప్ప టాస్కులు, గేమ్స్ లో పెద్దగా యాక్టివ్ గా పాల్గొనలేకపోయింది. నైనిక ఆట తీరును చూసి నాగార్జున ఆశ్చర్యపోయాడు. ‘ నైనిక నీ గేమ్‌ ఎటు పోయింది? నీలో ఫైర్‌ ఏమైపోయింది’ అని ఆమె ముఖం మీదే అడగడం నైనిక ఆట తీరుకు అద్దం పడుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.