రీతూ తొండాట… సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి

Updated on: Dec 06, 2025 | 4:03 PM

బిగ్ బాస్ లో రీతూ, భరణి మధ్య టాస్క్ వివాదం తీవ్రమైంది. 'రింగ్ మాస్టర్' టాస్క్ లో రీతూ గెలిచినా, తర్వాత 'జంక్ యార్డ్' టాస్క్ లో షేప్స్ గుర్తింపుపై భరణి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ట్రయాంగిల్ కాదని వాదించాడు. ఈ వాదన తీవ్రమై, భరణి ఫైనలిస్ట్ రేసు నుండి నిష్క్రమించాడు. సంచాలక్ నిర్ణయంపైనా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

నిన్నటి ఎపిసోడ్‌లో రీతూ చౌదరి, భరణి శంకర్‌ల మధ్య ‘రింగ్ మాస్టర్’ అనే నాకౌట్ టాస్క్ జరిగింది. ఈ గేమ్ లో రీతూ గెలిచింది. కానీ చివరిలో నాకు డౌట్ ఉందంటూ తనూజ అనడంతో ఈ టాస్క్ సంచాలక్ సంజనపై బిగ్ బాస్ కు కంప్లైట్ చేశారు. సంచాలక్ తీసుకున్న నిర్ణయంపై సీరియస్ అయ్యాడు భరణి. అయితే లేటెస్ట్ టాస్క్ జంక్ యార్డ్‌లో ఉన్న ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ షేప్స్‌ని గుర్తించి వాటిని ముందు ఎవరు పెడితే వాళ్లు గెలిచినట్టు. ఈ టాస్క్‌లో రీతూ, భరణి మధ్య జరిగింది. అయితే రీతూ గెలుపుపై భరణి అభ్యంతరం వ్యక్తం చేశాడు. రీతూ పెట్టిన షేప్స్‌లో ఒకటి ట్రయాంగిల్ కాదని, దానికి మూడు భుజాలకు బదులుగా నాలుగు భుజాలు కనిపిస్తున్నాయని, అది రెక్టాంగిల్ అవుతుందని భరణి వాదించాడు. దీనిపై రీతూ “నా పేరు ఎందుకు తీస్తున్నారు? దాన్ని ట్రయాంగిల్ కాకుండా ఏమంటారు మరి?” అంటూ అరిచింది. “నేను సంచాలక్‌తో మాట్లాడుతున్నాను, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావ్” అని భరణి అంతే గట్టిగా బదులిచ్చాడు. ఈ వివాదం కారణంగానే భరణి ఫైనలిస్ట్ రేసు నుంచి ఔట్ అయ్యాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు

సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్‌.. పండక్కి ఊరెళ్లేదెలా ??

ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై రైలులో కొత్త మార్పులు..

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు