Demon Pavan: మారుతున్న బిగ్‌బాస్ ఓటింగ్ ట్రెండ్ దూసుకొస్తున్న డీమాన్
బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే ఉత్కంఠ చివరిదశకు చేరింది. కళ్యాణ్, తనూజ మధ్య గట్టి పోటీ కొనసాగుతుండగా, అనూహ్యంగా డీమాన్ పవన్ ఓటింగ్ లో దూసుకువచ్చాడు. రీతూ ఎలిమినేషన్ తర్వాత ఆట మార్చి, ఇప్పుడు మూడో స్థానానికి చేరి టైటిల్ రేసును మరింత రసవత్తరంగా మార్చాడు. చివరి రోజు ఓటింగ్ లో భారీ మార్పులు జరిగాయి.
బిగ్ బాస్ సీజన్ 9.. మరో రెండు రోజుల్లో ఫినాలే. దీంతో తమకు ఇష్టమైన కంటెస్టెంట్లను గెలిపించుకునేందుకు అటు పీఆర్ టీమ్స్, ఇటు ఫ్యాన్స్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈసారి టైటిల్ గెలిచేది ఎవరనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదటి నుంచి టైటిల్ రేసులో టాప్ స్థానంలో దూసుకుపోతుంది తనూజ. మొదట్లో విమర్శలు వచ్చినా.. తన ప్రవర్తనతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్నాడు కళ్యాణ్. ఇప్పుడు తనూజ, కళ్యాణ్ మధ్య అతి తక్కువ ఓటింగ్ తేడా ఉంది. అయితే ఆఖరిరోజు ఓటింగ్ లెక్కలు తారుమారు చేసేశాడు డీమాన్ పవన్. నిన్నటి వరకు టైటిల్ కు దగ్గరగా ఉన్నారు కళ్యాణ్, తనూజ. ఆ తర్వాతి స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఉండగా.. చివరి రెండు స్థానాల్లో డీమాన్, సంజన ఉన్నారు. కానీ ఇప్పుడు లెక్కలన్నీ మారిపోయాయి. డీమాన్ దెబ్బకు ఆఖరి రోజు ఓటింగ్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కామనర్ గా ఎంట్రీ ఇచ్చి టాప్ 5లో ఒకడిగా నిలిచాడు డీమాన్. కానీ మొన్నటి వరకు డీమాన్ అంటే రీతూ మాత్రమే అన్నట్లుగా గేమ్ నడిచింది. ఎప్పుడైతే రీతూ ఎలిమినేట్ అయ్యిందో అప్పుడే డీమాన్ ఆట మొదలైంది. టాస్కులలో అదరగొట్టేస్తూ సత్తా చాటాడు. రీతు ఎలిమినేట్ తర్వాత డీమాన్ ఓటింగ్ నే శాసించే స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు టాప్ 5 లెక్కలు కూడా మార్చేశాడు. ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ రేసులో కళ్యాణ్, తనూజ పోటా పోటీగా దూసుకుపోతున్నారు. ఇక ఇమ్మాన్యుయేల్ మూడవ స్థానానికి పరిమితం కాగా.. డీమాన్, సంజన నాలుగైదు స్థానాల్లో ఉన్నారు. అయితే ఆఖరి రోజు మాత్రం డీమాన్ దెబ్బకు ఓటింగ్ లెక్కలు మారిపోయాయి. నాలుగో స్థానంలో ఉన్న డీమాన్.. చివరిరోజు మాత్రం మూడవ స్థానానికి దూసుకొచ్చాడు. తొలి నాలుగు రోజుల ఓటింగ్ ప్రకారం.. కళ్యాణ్ టాప్ లో ఉంటే.. తనూజ రెండో స్థానంలో ఉంది. అలాగే మూడో స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఉండగా.. నాలుగో స్థానంలో డీమాన్.. ఐదవ స్థానంలో సంజన ఉన్నారు. కానీ ఇప్పుడు మూడో స్థానం ఇమ్మాన్యుయేల్ ను వెనక్కు నెట్టి ముందుకు వచ్చేశాడు డీమాన్. ప్రస్తుతం ఓటింగ్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ స్థానాలు ఇలా ఉన్నాయి. ముందుగా కళ్యాణ్, తర్వాత తనూజ, డీమాన్, ఇమ్మాన్యూయేల్, సంజన వరుస స్థానాల్లో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bandla Ganesh: ఓజీ డైరెక్టర్‌కు కాస్ల్టీ గిఫ్ట్ ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
Chinmayi: వాళ్లందరూ జంతువుల కన్నా హీనం..! నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
Bigg Boss Kalyan: ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా
