Virupaksha: అదృష్టం అంటే ఇదే.. డబుల్ బొనాంజా కొట్టేసిన తేజు

Virupaksha: అదృష్టం అంటే ఇదే.. డబుల్ బొనాంజా కొట్టేసిన తేజు

Phani CH

|

Updated on: Apr 22, 2023 | 9:36 AM

ఒకప్పటిలా కాకుండా... హీరోలు సినిమాలు చేస్తూనే ప్రొడ్యూసర్లుగా మారడం.. ఆ ఫీల్డ్ లోనూ సక్సెస్ అవ్వడం.. ప్రాఫిట్స్ గెయిట్ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే మెగా స్టార్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కూడా ఇదే దారిలో నడిచేందుకు ట్రై చేశారు. ట్రై చేయడమే కాదు.. దిమ్మతిరిగే హిట్ కొట్టారు.

ఒకప్పటిలా కాకుండా… హీరోలు సినిమాలు చేస్తూనే ప్రొడ్యూసర్లుగా మారడం.. ఆ ఫీల్డ్ లోనూ సక్సెస్ అవ్వడం.. ప్రాఫిట్స్ గెయిట్ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే మెగా స్టార్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కూడా ఇదే దారిలో నడిచేందుకు ట్రై చేశారు. ట్రై చేయడమే కాదు.. దిమ్మతిరిగే హిట్ కొట్టారు. మరో అవతార్‌లో తన జెర్నీని మొదలెట్టేశారు. ఎస్ ! బావ చెర్రీలాగే.. తను కూడా సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టాలని అనుకున్న తేజు.. డైరెక్టర్ కార్తీక్ చెప్పిన విరూపాక్ష స్టోరీ వినగానే.. తనే ప్రొడ్యూస్‌ చేయాలని అనుకున్నారట. డైరెక్టర్ సకుమార్‌ అండ్ ఎస్ వీ సీసీ కొల్లాబిరేషన్‌లో.. ఈ సినిమా నిర్మించేందుకు అడుగులు కూడా వేశారట. ఇక ఈ ముగ్గురి ప్రొడక్షన్స్‌లో అలా మొదలైన విరూపాక్ష తాజాగా సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. దానికి తోడు.. థియేటర్స్ .. నాన్ థియేటర్స్‌ వసూళ్లతోనే.. రిలీజ్ కు ముందే ప్రాపిట్‌ పట్టేసింది. షూర్ షాట్‌ బ్లాక్‌ బాస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు.. ప్రొడ్యూసర్‌గా తేజు జర్నీకి సూపర్ డూపర్ బూస్ట్ ఇచ్చేసింది. ఒక్క సినిమాతో..! అటు రెమ్యూనరేషన్ తో పాటు.. ప్రొడూసర్‌గా తేజుకు బాగానే గిట్టుబాటైందనే టాక్ వచ్చేలా చేసుకుంటోంది. తేజు అదృష్టం భళే బాగుందనే కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

RRR టీం వైపు.. బీజేపీ బాస్‌.. కలవనున్న అమిత్‌ షా

Virupaksha: రిలీజ్ ముందే విరూపాక్షకు దిమ్మతిరిగే లాభం..

 

Published on: Apr 22, 2023 09:35 AM