Multistarrer Movie: సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ కాంబినేషన్..! ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!

|

May 24, 2023 | 8:56 PM

బాలకృష్ణ కుర్రహీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ సక్సెస్లు సాధిస్తున్నారు. అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య. రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

బాలకృష్ణ కుర్రహీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ సక్సెస్లు సాధిస్తున్నారు. అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య. రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. కొద్ది రోజులుగా చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలయ్య జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమా పక్కా తెలంగాణ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ డ్రామాగా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇందులో బాలయ్య చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పై అంచనాలను పెంచేశాయి.

ఇదిలా ఉంటే బాలయ్య అనిల్ తర్వాత ఎవ్వరితో సినిమా చేయబోతున్నారన్నదని పై ఆసక్తి నెలకొంది. ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. బాలయ్యతో కలిసి సినిమా చేయనున్నాను అని క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ ఇద్దరి మల్టీస్టారర్ కు దర్శకుడు ఎవరు అనే ఆసక్తి నెలకొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.