Veera Simha Reddy: బాలయ్య మజాకా..! బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దన్నగా వీరసింహారెడ్డి.. బాలయ్య ఎంట్రీ అదుర్స్..

|

Jan 12, 2023 | 10:03 AM

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గోపి చంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గోపి చంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుము గురువారం విడుదలైన ఈ సినిమా హంగామా చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి అనుమతి ఇవ్వడంతో తెల్లవారు జామున 4 గంటల నుంచే థియేటర్లలో హంగామా మొదలైంది. థియేటర్ల వద్ద అభిమానులు కోలాహలం మాములుగా లేదు. మరోవైపు భాగ్యనగరంలోనూ పలు థియేటర్స్ వద్ద అభిమానులతో పాటు పలువురు సెలబ్రెటీలు సందడి చేశారు. ఇప్పటికే బాలకృష్ణ, గోపి చంద్‌ మలినేని అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు.వీరసింహారెడ్డి సినిమాకు సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే హైదాబాదర్‌లో కూకట్‌పల్లిలోని భ్రమరాంజ థియేటర్‌లో నారా బ్రాహ్మణి సినిమాను వీక్షించారు. ఇక్కడే బాలకృష్ణ సినిమా యూనిట్‌తో సినిమాను చూశారు.హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద వీరసింహ రెడ్డి సందడి మొదలైంది. తొలి షో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు హంగామా చేస్తున్నారు. జై బాలయ్య నినాదాలతో థియేటర్‌ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇక మరికొంత మంది అభిమానులు బాలయ్య గెటప్‌లు, జై బాలయ్య అని రాసి ఉన్న టీ షర్ట్స్‌తో సందడి చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 12, 2023 09:59 AM