Loading video

స్టార్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్‌ కు రివార్డ్‌.. ఎంత ఇచ్చారంటే..

|

Jan 22, 2025 | 3:28 PM

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగి వారం రోజులు కావస్తోంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ను సదరు వ్యక్తి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో సైఫ్‌ అలీఖాన్‌ను ఆస్పత్రికి తరలించేందుకు ఓ ఆటో డ్రైవర్‌ సాయం చేశాడు.

సకాలంలో సైఫ్‌ను సేఫ్ గా ఆస్పత్రికి చేర్చి నటుడి ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడీ ఆటో డ్రైవర్‌కే… రివార్డు లభించింది. సైఫ్ అలీఖాన్‌పై నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో సైఫ్ కుటుంబ సభ్యులు ఆయనను ఓ ఆటో డ్రైవర్ సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను షార్ట్ కట్స్ వెతుక్కుంటూ సైఫ్ ను లీలావతి ఆస్పత్రికి చేర్చాడు. తద్వారా నటుడికి సకాలంలో చికిత్స అందేలా చేశాడు. ఇలా సైఫ్ ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించిన ఆ ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్. తాజాగా ఈ ఆటో డ్రైవర్ కు ముంబయిలోని ఓ సంస్థ 11 వేల రూపాయల రివార్డు ఇచ్చి సత్కరించింది. ఈ రివార్డ్‌ విలువ తక్కువే అయినా.. ఓ సంస్థ ఇలా ముందుకు వచ్చి స్టార్ ను ఆదుకున్న ఆటో డ్రైవర్‌ను ప్రొత్సహించడం ఇప్పుడు నెట్టింట హాట్ డిస్కషన్‌గా మారింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సింధు నదిలో టన్నుల కొద్దీ బంగారం.. పాక్‌ దశ తిరగనుందా ??

Akhanda 2: అఘోరాల మధ్య అఖండ -2 “తాండవం” షూటింగ్

ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. నాలుగు ఆకులు తిన్నారంటే రోగాలన్నీ పరార్

కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడు ! చివరకు..

వీళ్లే నిప్పంటిస్తారు..వీళ్లే ఆర్పుతారు.. ఇదేం పైత్యమో..!