గోటితో పోయేదానికి గొడ్డలి దాకానా.. చురకలంటించిన పవన్‌ కళ్యాణ్‌

|

Dec 31, 2024 | 11:39 AM

ఎట్టకేలకు అల్లు అర్జున్ ఇష్యూపై ఏపీ డిప్యూటీ సీంఎ పవన్ రియాక్టయ్యారు. తనదైన స్టైల్లో దీనిపై మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారంటూ బన్నీ ఇష్యూను సింగిల్ లైన్‌లో తేల్చేశారు. అభిమాని మృతిచెందిన తర్వాత.. వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలని.. అయితే ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టైందని పవన్ క్లియర్ గా చెప్పారు.

అంతేకాదు సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేదని.. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదని అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్‌. రేవంత్‌ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారని చెప్పారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలని పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేశారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్‌ రేట్ పెంచడం కూడా.. పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అని చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అన్ స్టాపబుల్ షోకు గ్లోబల్ స్టార్.. బాలయ్య, చరణ్ కాంబో అదుర్స్

బాలయ్య షోకు డాకు మహరాజ్ !! ఇక రచ్చ రంబోలా అంతే !!