Anil Ravipudi: అనిల్ రావిపూడి.. సెంటిమెంట్‌ని రిపీట్‌ చేస్తున్నారా ..?

Edited By:

Updated on: Nov 15, 2025 | 9:26 AM

అనిల్‌ రావిపూడి సెంటిమెంట్‌ని రిపీట్‌ చేస్తున్నారా? అందులోనూ వెంకీమామకి జోడీగా తమన్నాని తీసుకొస్తున్నారా? స్పెషల్‌ సాంగులతో నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అవుతున్న మిల్కీ బ్యూటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారా? ఇలాంటి ఎన్నో విషయాలు ప్రశ్నల రూపంలో డిస్కషన్‌లో ఉన్నాయి ఫిల్మ్ నగర్‌ వీధుల్లో. అనిల్‌ రావిపూడి లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్‌గారులో తమన్నా స్పెషల్‌ సాంగ్‌ చేస్తారన్నది ఫిల్మ్ నగర్‌ టాక్‌.

అనిల్‌ రావిపూడి సెంటిమెంట్‌ని రిపీట్‌ చేస్తున్నారా? అందులోనూ వెంకీమామకి జోడీగా తమన్నాని తీసుకొస్తున్నారా? స్పెషల్‌ సాంగులతో నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అవుతున్న మిల్కీ బ్యూటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారా? ఇలాంటి ఎన్నో విషయాలు ప్రశ్నల రూపంలో డిస్కషన్‌లో ఉన్నాయి ఫిల్మ్ నగర్‌ వీధుల్లో. అనిల్‌ రావిపూడి లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్‌గారులో తమన్నా స్పెషల్‌ సాంగ్‌ చేస్తారన్నది ఫిల్మ్ నగర్‌ టాక్‌. ఈ మూవీలో మెగాస్టార్‌ చిరంజీవి సరసన నయనతార నాయికగా నటిస్తున్నారు. కేథరిన్‌ మరో నాయిక. విక్టరీ వెంకటేష్‌ కీ రోల్‌ చేస్తున్నారు. ఇన్ని హంగులున్నా సరే, స్పెషల్‌ అట్రాక్షన్‌గా తమన్నాని ప్రాజెక్ట్ లోకి తీసుకొస్తున్నారట అనిల్‌. ఎఫ్‌2, ఎఫ్‌3లో వెంకీ – తమన్నా కెమిస్ట్రీ చూసిన వాళ్లు తెగ నవ్వుకున్నారు. ఈ సారి కూడా సంక్రాంతికి ఆ నవ్వులు రిపీట్‌ కానున్నాయా? లేకుంటే తమన్నా జస్ట్ అలా వచ్చి ఇలా సాంగ్‌ చేసి వెళ్లిపోతారా? అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇండస్ట్రీలో వైరల్‌ అవుతున్న ఈ విషయం నిజమైతే మాత్రం.. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత నయన్‌ అండ్‌ తమన్నా కలిసి మళ్లీ ఓ సినిమాలో కనిపిస్తారన్నది ఫ్యాన్స్ లో ఊపు తెస్తున్న విషయం. మన శంకరవరప్రసాద్‌గారు విషయంలో ఏ సెంటిమెంట్‌నీ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు అనిల్‌ రావిపూడి. తన గత చిత్రాల్లోని నాయికలతో ప్రెజెంట్‌ మూవీస్‌లో స్పెషల్‌ సాంగులు చేయించడం ఆయన స్పెషాలిటీ. సో, ఈ పండక్కి కూడా ఆ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారన్నమాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓటీటీల నిర్ణయంతో సినిమా బడ్జెట్‌లు తలకిందులవుతాయా

సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ వారసులు