Anil Ravipudi: అనిల్ రావిపూడి మాస్ ప్లానింగ్‌కు అందరూ ఫిదా
అనిల్ రావిపూడి 9 విజయాల తర్వాత మల్టీస్టారర్‌కు సిద్ధమవుతున్నారు. రాజమౌళి తర్వాత ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన అనిల్, తన "హిట్ మిషన్" కొనసాగించనున్నారు. వెంకటేష్‌తో పాటు తమిళ/మలయాళం అగ్ర హీరోతో 2027 సంక్రాంతికి హ్యూమరస్ థ్రిల్లర్‌తో రానున్నారు. విచిత్రమైన టైటిల్‌తో ఈ దర్శకుడు మళ్ళీ తన మార్క్ చూపించనున్నారు.
అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఏంటి..? మనోడి ట్రాక్ రికార్డు చూసాక ఎలాంటి సినిమాతో రాబోతున్నారు.. మరోసారి సంక్రాంతి నేపథ్యంలో వస్తారా లేదంటే భగవంత్ కేసరిలా కొత్తగా ప్రయత్నం చేస్తారా అనే ఆసక్తి అందర్లోనూ ఉంది. అయితే అందరి ఊహలకు మించి ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. మరి ఈ హిట్ మిషన్ ప్లాన్ ఏంటి..? వరసగా రెండు సక్సెస్‌లు వస్తేనే ప్రెజర్ హ్యాండిల్ చేయడం కష్టం అనుకుంటే.. అనిల్ రావిపూడికి ఏకంగా వరసగా 9 విజయాలు వచ్చాయి. రాజమౌళి తర్వాత తెలుగులో ట్రిపుల్ హ్యాట్రిక్ పూర్తి చేసింది అనిల్ ఒక్కరే. మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ ఏం చేయబోతున్నారనే క్యూరియాసిటీకి తెరదించుతూ.. అదిరిపోయే మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారీయన. అనిల్ రావిపూడికి మల్టీస్టారర్ కొత్త కాదు.. ఎఫ్ 2, ఎఫ్ 3లలో వెంకీ, వరుణ్ తేజ్‌లను కలిపారు.. అలాగే చిరు, వెంకీతో మన శంకరవరప్రసాద్ గారు చేసారు. కాకపోతే వెంకటేష్ కాసేపే కనిపించారు. అందుకే ఈసారి ఫుల్ లెంత్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారు అనిల్. అందులో వెంకటేష్ ఓ హీరో.. మరొకరు తమిళ, మలయాళం నుంచి ఒక అగ్ర హీరో రానున్నారు. తన సెంటిమెంట్ కొనసాగిస్తూ.. 2027 సంక్రాంతికే నెక్ట్స్ సినిమాతో రానున్నారు. ఈసారి విచిత్రమైన టైటిల్ ఫిక్స్ చేసామని.. ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాక.. వీడు మళ్లీ మొదలుపెట్టాడురా అని నవ్వుకుంటారని చెప్పారు అనిల్ రావిపూడి. నెక్ట్స్ టైమ్ కూడా పండగ ఫీల్ ఉండేలా.. వెంకీతో కలిసి హ్యూమర్‌తో కూడిన థ్రిల్లర్‌తో రాబోతున్నారు ఈ దర్శకుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: ట్రెండింగ్ అవుతున్న సమంత.. అసలు కారణం ఇదే
Ustaad Bhagat Singh: ఉస్తాద్ డేట్ లాక్.. మెగా ఫ్యాన్స్‌కు షాక్
జనవరి నుంచి సమ్మర్ వరకు.. క్రేజీ సినిమాల జాతర
పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది