చిరు సెట్‌లో అడుగుపెట్టిన వెంకీ

Updated on: Oct 24, 2025 | 8:10 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించి అంచనాలు పెరుగుతున్నాయి. విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో భాగం కావడంతో సందేహాలకు తెరపడింది. బుధవారం నుండి చిరు, వెంకీ కాంబో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. సంక్రాంతి విడుదల కానున్న ఈ చిత్రం డబుల్ డోస్ వినోదాన్ని అందిస్తుందని చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తోంది.

సూపర్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి కెప్టెన్సీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారు అనే కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. సంక్రాంతి బరిలో విడుదల చేయనున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ అంచనాలను మరింత పెంచుతూ విక్టరీ హీరో వెంకటేశ్ చిత్ర బృందంతో చేరారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై మొదట నుంచీ అభిమానులలో భారీ అంచనాలున్నాయి. అనిల్ రావిపూడి గత విజయాలు చూసి మెగా అభిమానులు ముందుగానే సంబరాలు మొదలుపెట్టారు. అనిల్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన వెంకటేశ్, ఇప్పుడు చిరంజీవి సినిమాలోనూ భాగం కావడం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్

టాక్సిక్ విషయంలో తప్పెక్కడజరుగుతోంది ??

ఉత్త పోస్టర్‌ మాత్రమే అనుకునేరు.. ఆ పోస్టర్‌తోనే కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్

‘నేను విడాకులు తీసుకుంటే వాళ్లు సంబరాలు చేసుకున్నారు’

‘అరడజను’ పిల్లలతో సంతోషంగా ఉండు బావా !! డార్లింగ్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విష్