‘మానసికంగా కుంగిపోయా’ రష్మీ షాకింగ్ ట్వీట్ !

Updated on: Jul 24, 2025 | 7:52 PM

ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీతో పాటు పలు టీవీషోలతో బిజి బిజీగా ఉంటున్నారు యాంకర్ రష్మీ. మరో పక్క సినిమాల్లోనూ మెరుస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన అన్ని విషయాలను తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఈ స్టార్ యాంకర్ ఉన్నట్లుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌ ఇప్పుడు ఆమె ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌ను షాకయ్యేలా చేసింది. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ కాస్త ఇబ్బందులో ఉన్నానంటూ తన పోస్టులో రాసుకొచ్చారు రష్మి… సోషల్ మీడియాలో చెప్పే అడ్డమైన నీతులు వినే ఓపిక, తీరిక తనకు లేదన్నారు. అందుకే నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తన ట్వీట్‌తో రివీల్ చేశారు ఈ బ్యూటీ. తాను మళ్లీ బలంగా, ధైర్యంగా తిరిగొస్తానని, తాను ఇంకా చాలా నిరూపించుకోవాల్సి ఉందని.. తన శక్తిని తాను పునరుద్ధరించుకోవాల్సిన అవసరముందని తన ఫ్యాన్స్‌ కు వివరించింది రష్మీ. తనకు ఎవరి డిజిటల్ ఎంకరేజ్‌మెంట్ అవసరం లేదంటూ స్ట్రాంగ్‌ కామెంట్ చేసింది. తనకున్న కాన్ఫిడెన్స్‌తో తన లక్ష్యాలను సాధించుకోలగను అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు ఈమె. దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని తానెప్పుడు కోల్పోలేదని తన పోస్టులో మెన్షన్ చేసిన రష్మిక.. అదెప్పుడూ తన దగ్గరే ఉందన్నారు. అయితే ఎక్కడో ఓ చోట తాను బాగా కుంగిపోతున్నానని.. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కనుక్కోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో తాను యాక్టివ్‌గా లేకపోయినా అభిమానుల ప్రోత్సాహం, ప్రేమ, సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నానంటూ తన సుదీర్ఘ పోస్టును ముగించారు రష్మి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎలా ఉండేది.. ఎలా అయింది! వైరలయ్యేందుకు కాదుగా ఈ డ్రామాలు?

బైకుపై కూర్చున్న వ్యక్తి.. సడన్‌గా వచ్చిన పాము.. ఆ తర్వాత..?

బొంగులో చికెన్‌ కాదు.. వెదురు బొంగుల కూర తింటే వదిలిపెట్టరు

చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు ఈ కూరగాయలోనే

Sweet Potato: చిలకడ దుంప.. చేసే మేలు ఎంతో