Allu Arjun: వైరల్ అవుతున్న ఐకాన్ స్టార్ స్క్రీన్ సేవర్…. మార్చి వరకు మార్చేదే లే
అల్లు అర్జున్ ఫోన్ స్క్రీన్ సేవర్ ఇప్పుడు హాట్ టాపిక్. "నో స్నాక్, నో షుగర్, నో సోడా" తో పాటు మార్చి 27, 2026 అనే తేదీని ఆయన డిస్‌ప్లే చేశారు. అట్లీ దర్శకత్వంలో రాబోయే సినిమా కోసమే ఈ ఆహార నియమాలు పాటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేందుకు అల్లు అర్జున్ చేస్తున్న కృషి ఇది.
సినిమా ఏదైనా కంప్లీట్‌గా కొత్తగా కనిపించాలని అహర్నిశలూ పాటుపడుతుంటారు చాలా మంది హీరోలు. వాళ్లల్లో ఫ్రెంట్ బెంచ్‌లో కనిపిస్తారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. లేటెస్ట్ గా ఆయన స్క్రీన్ సేవర్ చూసిన వాళ్లు డీకోడ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నో స్నాక్, నో షుగర్, నో సోడా.. అనే పదాలున్నాయి అల్లు అర్జున్ స్క్రీన్ మీద. అంతే కాదు.. మార్చి 27, 2026 అనే టైమ్‌ని కూడా ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రతి సినిమాకీ ఫిట్‌గా కనిపించే ఐకాన్‌స్టార్.. నెక్స్ట్ అట్లీ కోసం వీటన్నిటినీ తినకుండా కట్ చేశారా? వచ్చే ఏడాది మార్చి 27 వరకు ఈ నియమాలను పాటిస్తారా అనే డిస్కషన్ షురూ అయింది. లాస్ట్ ఇయర్ ఈ టైమ్‌కి నార్త్ ఇండియాలో పుష్ప2 ఈవెంట్‌తో హల్‌చల్ చేశారు ఐకాన్‌స్టార్. ఈ ఇయర్ మాత్రం డిఫరెంట్ రీజన్‌తో ట్రెండ్ అవుతున్నారు. అట్లీ మూవీ కోసం మేకోవర్‌లో భాగంగా ఆయన ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతున్నారని మాట్లాడుకుంటున్నారు జనాలు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది అట్లీ మూవీ. 2027లో రిలీజ్ అయ్యే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ షెడ్యూల్‌లో మృణాల్ పార్టిసిపేట్ చేశారని టాక్. ఎప్పటికప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవాలనుకునే అల్లు అర్జున్.. ఈ సారి గ్లోబల్ ఆడియన్స్ అటెన్షన్ కోసం మరింత కృషి చేస్తున్నారు. స్క్రీన్ మీద జస్ట్ తన కమిట్‌మెంట్ మాత్రమే కాదు.. అయాన్ పేరు కూడా రాసుకున్నారు బన్నీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెట్స్ మీదున్న వెండితెర దేవుళ్లు.. పోటీ మామూలుగా లేదుగా
పైరసీకి అడ్డుకట్ట వేయాలంటే.. ఆ పని చేయాల్సిందేనా ??
రెండు పార్టులుగా రానున్న ప్రభాస్ ఫౌజీ ?? ఆనందంలో అభిమానులు
వైరల్ వయ్యారికి లేడీ సూపర్‌స్టార్ సలహాలు.. ఇంకా హిట్ పక్కనా ??