Allu Arjun: AA22కు పుష్ప సెంటిమెంట్.. రూ.2,000 కోట్ల ప్లాన్

Edited By:

Updated on: Dec 19, 2025 | 4:33 PM

అల్లు అర్జున్ 'AA22' సినిమా 'పుష్ప' తరహాలో రెండు భాగాలుగా విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విస్తృతి ఎక్కువ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 'పుష్ప' రెండు భాగాల ప్లాన్ అద్భుత విజయం సాధించగా, 'AA22' కూడా అదే సెంటిమెంట్‌ను అనుసరించి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సెంటిమెంట్ ఒకటి అలవాటయ్యాక అందులోంచి బయటికి రావడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా హీరోలకు ఓసారి వర్కవుట్ అయిన సెంటిమెంట్ వదలడానికి అంత ఈజీగా మనసు రాదు. AA22 విషయంలో అల్లు అర్జున్ తాజాగా ఇదే చేస్తున్నారని తెలుస్తుంది. అట్లీ కోసం 2000 కోట్ల ట్రెండ్ ఫాలో అవుతున్నారీయన. మరి బన్నీ ఏం చేస్తున్నారో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా…? అల్లు అర్జున్‌కు కెరీర్ పరంగా టర్నింగ్ పాయింట్ అల వైకుంఠపురములో అయితే.. మార్కెట్ పరంగా టర్నింగ్ పాయింట్ పుష్ప. ఆ సినిమాతో తెలుగు సినిమా రికార్డులు తిరగరాస్తే.. ఈ సినిమాతో ఇండియన్ సినిమా రికార్డ్స్ కట్టగట్టేసి బుట్టలో వేసుకున్నారు బన్నీ. పుష్ప 2 పార్ట్స్ కలిపి ఏకంగా 2100 కోట్లకు పైగానే వసూలు చేసాయి. పుష్ప అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణం.. అందులో ఉన్న కంటెంట్ ఒకటైతే.. సీక్వెల్ ప్లాన్ చేసిన విధానం మరోటి..! సగం సినిమా పూర్తయ్యాక 2 పార్ట్స్ చేయాలని డిసైడ్ అయ్యారు సుకుమార్. ఆ ప్లాన్ నెక్ట్స్ లెవల్‌లో వర్కవుట్ అయింది. తాజాగా AA22 సినిమాకు ఇదే చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.. ఈ సినిమా 2 పార్ట్స్‌గా రానుందని టాక్ వినిపిస్తుంది. అట్లీ సినిమా కోసం ఫుల్లుగా మేకోవర్ అవుతున్నారు బన్నీ. ఇందులో మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే 2 గెటప్స్ విడుదలయ్యాయి కూడా..! మూడో లుక్ త్వరలోనే రానుంది. ఈ సినిమా స్టోరీ స్పాన్ భారీగా ఉండటంతో.. పుష్ప తరహాలోనే రెండు భాగాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ 2026లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్‌తో పాటు స్పాన్ కూడా భారీగా పెరిగిపోవడంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దీపిక, మృణాళ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్యారలల్ యూనివర్స్‌ క్రియేట్ చేస్తున్నారు అట్లీ. అవతార్ తరహాలో కొత్త క్రియేచర్స్ సృష్టిస్తున్నారు. దాదాపు 600 కోట్లతో సన్ పిక్చర్స్ AA22ను నిర్మిస్తుంది. మరి పుష్ప తరహాలో.. AA22 కూడా రికార్డ్స్ తిరగరాస్తుందేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినీ తారలను టెన్షన్ పెడుతున్న టెక్నాలజీ

ఆస్కార్‌కు ఇండియా నుంచి ఒకే ఒక్కటి

The Raja Saab: ఫ్యాన్స్ కోసం తప్పట్లేదంటున్న ప్రభాస్

మీడియం రేంజ్ హీరోలు కూడా ఇలా చేస్తే ఎలా..?

పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన