అంతకు మించి అనేలా ఉండబోతున్న AA 22.. హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్..

Edited By: Phani CH

Updated on: Oct 08, 2025 | 3:35 PM

పుష్పరాజ్‌గా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్‌, ఇప్పుడు అంతకు మించి అన్న రేంజ్‌లో ఓ గ్లోబల్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమాతో మరో రేర్‌ రికార్డ్‌కు రెడీ అవుతున్నారు ఐకాన్‌ స్టార్‌... ఏంటా రికార్డ్ అనుకుంటున్నారా..? అయితే వాచ్‌ దిస్ స్టోరీ.

ఒక్కో సినిమాతో తన రేంజ్‌ తానే పెంచుకుంటూ పోతున్న అల్లు అర్జున్‌, ఈ జర్నీలో గ్లామర్‌కు కూడా మ్యాగ్జిమమ్ స్కోప్ ఇస్తున్నారు. ముఖ్యంగా బన్నీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు స్పెషల్ క్రేజ్‌ ఉంటుంది. ఆ క్రేజ్‌ పుష్ప, పుష్ప 2 మూవీస్‌తో మరింత పెరిగింది. పుష్ప లో ఊ అంటావా.. పుష్ప 2లో కిస్సిక్ సాంగ్స్ సినిమా సక్సెస్‌లోనూ చాలా హెల్ప్ అయ్యాయి. అందుకే అప్‌ కమింగ్ ప్రాజెక్ట్‌లోనూ అలాంటి సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఆ సాంగ్‌లో కనిపించబోయే బ్యూటీ ఎవరన్న డిస్కషన్ జరుగుతోంది. ఆల్రెడీ ఐదుగురు హీరోయిన్లు నటిస్తారని ఊరిస్తున్న యూనిట్ వాళ్లలో ఒకరినే స్పెషల్ సాంగ్‌కు ఫిక్స్ చేస్తుందా? అన్న టాక్ వినిపిస్తోంది. ఒక వేళ ఆల్రెడీ ఫిక్స్ అయిన ఐదుగురు కాకపోతే స్పెషల్ సాంగ్‌లో బన్నీతో కలిసి ఆడిపాడే బ్యూటీ ఎవరు? అన్న చర్చ కూడా మొదలైంది. బాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్ ఇస్తారా..? లేదా సౌత్‌ ఫ్లేవర్‌కు ఓటేస్తారా..? ఈ విషయంలోనే గట్టిగానే చర్చ జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Baahubali: బాహుబలి టీంలో రీ రిలీజ్ జోష్.. క్రేజ్ మామూలుగా లేదుగా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు.. మరో బ్లాక్ బస్టర్ పక్కా

దెబ్బ మీద దెబ్బ.. మూసీవాసులకు నిద్రలేకుండా చేస్తున్న పాములు.. ఇంత ఉన్నాయేంటి మావ

Rajinikanth: డివోషనల్ ట్రిప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్.. కారణం అదేనా ?

TOP 9 ET News: OG ప్రీక్వెల్‌లో అకీరా.. క్లారిటీ ఇచ్చిన సుజీత్

Published on: Oct 08, 2025 03:33 PM