Alia Bhatt: ఏడాదికి ఒక్క సినిమానే.. బిగ్ డెసిషన్ తీసుకున్న ఆలియా భట్

Edited By:

Updated on: Jan 03, 2026 | 3:15 PM

అలియా భట్ సినిమా అప్‌డేట్స్‌తో సంబంధం లేకుండా వార్తల్లో ఎలా ఉండాలో బాగా అర్థం చేసుకున్నారు. తల్లిగా బాధ్యతలు పెరగడంతో, ఆమె ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు. తన కూతురితో ఎక్కువ సమయం గడపాలని ఆశించినప్పటికీ, 'ఆల్ఫా', 'లవ్ అండ్ వార్' వంటి చిత్రాలతో నిమగ్నమైన అలియా, ఫ్యాన్స్‌ను మాత్రం ఎప్పుడూ ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు. సినిమా కెరీర్‌ను, కుటుంబ జీవితాన్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తున్నారు.

సినిమా అప్‌డేట్స్ ఉన్నా లేకపోయినా… ఎప్పుడూ వార్తల్లో ఉండటం అన్నది సెలబ్రిటీలకు చాలా అవసరం. ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్నారు బాలీవుడ్ క్యూటీ ఆలియా భట్. అందుకే మూవీ న్యూస్‌తో సంబంధం లేకుండా.. ఎదో ఒక స్టేట్మెంట్‌తో ఎప్పుడూ న్యూస్ హెడ్‌లైన్స్‌లో ఫ్లాష్ అవుతున్నారు ఆలియా. జిగ్రా సినిమా నిరాశపరచటంతో బ్రేక్ తీసుకున్న ఆలియా భట్‌, షార్ట్ గ్యాప్‌ తరువాత స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఆల్ఫా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్‌ సీన్స్‌కోసం ప్రీపేర్ అవుతున్నారు. అదే సమయంలో భర్త రణబీర్ కపూర్‌తో కలిసి లవ్ అండ్ వార్‌ మూవీలోనూ నటిస్తున్నారు. ఆల్ఫా, లవ్ అండ్ వార్‌ మూవీస్‌ ఇంకా షూటింగ్ స్టేజ్‌లోనే ఉండటంతో ఇప్పట్లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచన లేదన్నారు ఆలియా. ‘ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేశాను. కానీ ఇక మీదట అలా చేయను. ఒక సినిమా మాత్రమే చేస్తా’ అంటున్నారు. అమ్మ అయ్యాక బాధ్యతలు పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆలియా. తన కూతురితో ఎక్కువ సమయం గడపాలన్న ఉద్దేశంతోనే ఇష్టం లేకపోయినా సినిమాలు తగ్గించుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆల్ఫా సినిమా తరువాత చేయబోయే సినిమా ఏంటన్నది ఇంత వరకు కన్ఫార్మ్ చేయలేదు ఈ క్యూటీ. సినిమాల సంగతి ఎలా ఉన్నా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండటంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు ఈ బ్యూటీ. గత ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా.. ఏదో ఒక అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ను ఎంగేజ్‌ చేస్తూనే వచ్చారు. ఫ్యూచర్‌లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేయబోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్‌ ధరపై డిస్కౌంట్‌

మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో

ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే

ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే

రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు