50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో…! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు

Updated on: Dec 21, 2025 | 12:02 PM

అక్షయ్ ఖన్నా 'ధురంధర్', 'ఛావా' సినిమాలతో తిరిగి పాపులర్ అయ్యారు. ఆయన అద్భుతమైన నటనకు చాలా మంది అభిమానులుగా మారారు. అయితే, 50 ఏళ్ల వయసులోనూ ఆయన పెళ్లి చేసుకోలేదని తెలిసి నెట్టింట షాకవుతున్నారు. పెళ్లి తనకు సరిపడదని, జీవితంపై పూర్తి నియంత్రణ ఉండాలని కోరుకుంటూ, బాధ్యతలు వద్దని అక్షయ్ ఖన్నా గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ధురంధర్ సూపర్ హిట్ సినిమాతో నటుడు అక్షయ్ ఖన్నా క్రేజ్ మరింత పెరిగింది . రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో , అక్షయ్ ఖన్నా రెహ్మాన్ డకైట్ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషించాడు. ఈ ఏడాది ప్రారంభంలో విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా మూవీలోనూ ఔరంగ జేబు పాత్రలో ఈయనే అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. ఇప్పుడు ధురంధర్ సినిమాలోనూ తన నటనతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే చాలా మంది ఈయన గురించి ఇప్పుడు ఉన్నట్టుండి నెట్టింట ఆరా తీస్తున్నారు. అలా ఆరా తీస్తున్న క్రమంలోనే 50 ఏళ్ల వయసున్న ఈయన ఇంకా పెళ్లి చేసుకోలేదనే విషయం తెలిసి షాకవుతున్నారు. అందుకు గల కారణాన్ని తెలుసుకుని అవాక్కవుతున్నారు. అక్షయ్ ఖన్నా గతంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడారు. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పిన అక్షయ్ ఖన్నా.. పెళ్లికి తాను సరైన వ్యక్తిని కాదన్నాడు. వివాహం అనేది ఒక నిబద్ధత. అది జీవితంలో ఒక పెద్ద మార్పు. మీరు మీ జీవితాన్ని వేరొకరితో పంచుకున్నప్పుడు, మీకు పూర్తి నియంత్రణ ఉండాలన్నాడు. తన జీవితంపై తనకు పూర్తి నియంత్రణ కావాలని ఆ ఉద్దేశ్యంతోనే తాను పెళ్లికి దూరంగా ఉన్ననంటూ చెప్పుకొచ్చాడు అక్షయ్ ఖన్నా. అంతేకాదు తనకు బాధ్యతలు వద్దని.. తాను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతానంటూ చెప్పాడు. తాను ఎవరి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం రాకూడదని.. తాను తన గురించి మాత్రమే ఆలోచించాలనే భావనలో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. తనకు ఈ అద్భుతమైన జీవితం ఉందని.. దానిని తాను నాశనం చేయదలుచుకోనన్నాడు. ప్రస్తుతం ఈయనర గతంలో చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అక్షయ్ ఖన్నా గురించి ఆరా తీసే వారిని.. ఆయన ఫ్యాన్స్‌గా మారిన వారిని షాక్‌ కు గురిచే స్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Today Gold Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. ఇవాళ తులం ఎంత అంటే..

పెరుగుతున్న చలి తీవ్రత.. రానున్న రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశం

ఏలియన్ల “ఏరియా 51′ గుట్టు విప్పే సినిమా ??

తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్‌ మహిళ

Samantha: సమంత న్యూ ఇయర్ రిజల్యూషన్ పోస్ట్‌ వైరల్‌.. తప్పులు దిద్దుకుంటా