Akhanda 2: బాలయ్య కెరీర్లోనే రికార్డ్‌.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్

Updated on: Dec 13, 2025 | 11:45 AM

అఖండ తాండవం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్. బాలయ్య హై ఎనర్జీ, బోయపాటి దర్శకత్వం అద్భుతంగా కలగలిసి ప్రతీ సీన్‌ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అఖండ 2 భారీ ఓపెనింగ్స్‌తో బాలయ్య కెరీర్‌లో రికార్డు సృష్టించింది. బోయపాటి అఖండ 2 చివర్లో జై అఖండ పేరుతో అఖండ 3కి హింట్ ఇవ్వడం అభిమానులకు సంతోషాన్నిచ్చింది. ఈ సీక్వెల్స్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

అఖండ తాండవం ఇప్పుడు అలోవర్ వరల్డ్ హాట్ టాపిక్ అవుతోంది. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. బాలయ్య హై ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్..బోయపాటి డైరెక్షన్ వెరసి.. అఖండ సినిమాలోని ప్రతీ సీన్‌కు ఆడియన్ ఎంజాయ్‌ చేయడం కనిపిస్తోంది. అందులోను యాక్షన్ సీన్స్‌లో అయితే.. సగటు ప్రేక్షకుడికి గూస్ బంప్స్ రావడం కామన్ అనే టాక్ వస్తోంది. చిన్న చిన్న మైనస్‌లు, లాజిక్స్‌ పక్కకు పెడితే సినిమా బిగ్ హిట్ అనేలా యునానిమస్ టాక్ వస్తోంది. దీంతో అఖండ2 మూవీకి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. బాలయ్య కెరీర్లోనే ఇదో రికార్డ్‌ గా మేకర్స్‌ నుంచి టాక్ వస్తోంది. బాలయ్య ఫ్యాన్స్‌ కు మరో లడ్డూ లాంటి అప్డేట్‌నిచ్చారు బోయపాటి. అఖండ2 కు సీక్వెల్‌ గా అఖండ3 కూడా ఉండనుందంటూ హింట్ ఇచ్చాడు. అఖండ2 సినిమా చివర్లో జై అఖండ పేరుతో నెక్ట్స్ సీక్వెల్‌కు లీడ్‌ ఇచ్చాడు. దీంతో బాలయ్య అభిమానులు ఖుషీ అవుతున్నారు. జై అఖండ అంటూ అప్పుడే సంబరాలు షురూ మొదలు పెట్టేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Emanuel: టాస్క్‌లో గాయపడ్డ ఇమ్మాన్యుయేల్‌! నొప్పితో విలవిల

పాపం తనూజ..! అతడి కామెంట్‌కు ముఖం మాడ్చుకుంది

మెస్సీతో ఫోటో.. రూ.10 లక్షలు మాత్రమే

శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?