Akhanda 2: థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న అఖండ 2.. 3rd Day ఎంత వసూల్ చేసిందంటే

Updated on: Dec 16, 2025 | 1:17 PM

నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. తొలి రోజే రూ. 59.5 కోట్లు వసూలు చేసి బాలకృష్ణ కెరీర్ లోనే రికార్డు సృష్టించింది. 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 76 కోట్లు రాబట్టి అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేసింది.

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో పాటే తొలి రోజే భారీ ఓపినింగ్స్ సొంతం చేసుకుంది. ప్రీమియర్స్ తో కలిపి ఈ మూవీ ఫస్ట్ డే 59.5 కోట్లు వసూలు చేసినట్లు తెలిపింది చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్. బాలకృష్ణ కెరీర్ లోనే మొదటిరోజు ఈ స్థాయిలో వసూలు చేసిన ఫస్ట్ మూవీ ఇదేనని తెలిపింది.ఇక ఈ సినిమా రెండో రోజు రూ. 15 కోట్లు రాబట్టింది. మొత్తంగా రెండు రోజులకు రూ. 46కోట్లు రాబట్టింది. కాగా మూడో రోజు కూడా కలెక్షన్స్ కుమ్మేసిందని తెలుస్తుంది. నిన్న ఆదివారం కావడంతో అఖండ కలెక్షన్స్ పుంజుకున్నాయి. మూడు రోజులకు కలిపి అఖండ 2 సినిమా రూ. 61 కోట్ల వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 76కోట్లు వసూల్ చేసిందని దిన్‌సైడ్ టాక్.డిసెంబర్ 11 ఆదివారం ఒక్క రోజే అఖండ సినిమా దేశవ్యాప్తంగా రూ. 15 కోట్లు వసూల్ చేసినట్టు తెలుస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Suman Shetty: బిగ్ బాస్ చరిత్రలోనే భారీ రెమ్యూనరేషన్ !! సుమన్ శెట్టికి భారీగా డబ్బులు