ఐశ్వర్యారాయ్ 17 ఏళ్లుగా రాఖీ కడుతున్న ఆ స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
రక్షాబంధన్ కుల మతాలతో సంబంధం లేని బంధాలను అనుబంధాలకు సంబంధించిన పండుగ. దేశవ్యాప్తంగా రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సోదరి సోదరుల మధ్య బంధాన్ని మరింత బలపరిచే వేడుక అది. అది రక్త సంబంధమైన హృదయం నుంచి ఏర్పడిన బంధమైన అలాంటి బంధం ఐశ్వర్యారాయ్ సోనుసూద్ బంధం. 17 ఏళ్ల క్రితం వీరిద్దరి మధ్య ఈ బంధం ఏర్పడింది.
ఓ సినిమాలో సోదరి సోదరులుగా నటించిన వీరి మధ్య ఆ బంధం అప్పటి నుంచి కంటిన్యూ అవుతోంది. అలా 17 ఏళ్లుగా క్రమం తప్పకుండా సోనుసూద్ కి రాఖీ కడుతున్నారు ఐశ్వర్యారాయ్. వారిద్దరి మధ్య ఈ అందమైన బంధం 2008లో ఆశుతోష్ గోవారికర్ చారిత్రక చిత్రం జోధా అక్బర్ సెట్స్ లో ప్రారంభమైంది. ఇది సోదరుడు సోదరి మధ్య ప్రేమ గౌరవానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. ఈ చిత్రంలో ఐశ్వర్య మహారాణి జోధాబాయి పాత్రను పోషించగా సోను తన సోదరి కోసం తన రాజ్యాన్ని పణంగా పెట్టడానికి సిద్ధమైన ఆమె సోదరుడు కున్వర్ సుజామల్ పాత్రను పోషించారు. తెరపై ఈ అన్నాచెల్లెళ్ల కెమిస్ట్రీ నిజ జీవితంలో ఒక అందమైన బంధంగా మారింది. జోధా అక్బర్ సినిమా షూటింగ్ సమయంలో ఐశ్వర్య సోనుకి రాఖీ కట్టినప్పుడు ఈ బంధం ప్రారంభమైందని చెబుతారు. అప్పటి నుంచి ప్రతి రక్షాబంధనికి ఐశ్వర్యారాయ్ సోనుసూద్ కి పవిత్ర రాఖీని కడుతున్నారు. గతంలో ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోను సూద్ జోధా అక్బర్ సినిమా సెట్స్ నుంచి ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ సన్నివేశంలో తాను ఐశ్వర్య తండ్రిని గుర్తు చేస్తున్నానని ఆమె చెప్పారన్నారు. ఐశ్వర్యారాయ్ తనను బాయ్ సాబ్ అని ప్రేమగా పిలుస్తారని తెలిపారు. అమితాబ్ ఫ్యామిలీ అద్భుతమైన కుటుంబమని వారితో తనకు మంచి స్నేహ బంధం ఉందని సోను సూద్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రేమంటే ఇదే..చనిపోయిన తోడును లేపుతున్న పక్షి..కన్నీరు పెట్టిస్తున్న వీడియో
21 ఏళ్ల వయసులో రేణూ దేశాయ్ ఎలా ఉందో చూశారా?
అతి పెద్ద గుహలో చిన్న ప్రపంచం..వీడియో చూస్తే మతిపోవాల్సిందే గురూ!