Naveen Polishetty: నాతో సినిమా చేస్తావా.. 15 కోట్లు + కండీషన్స్ అప్లై

Updated on: Jan 24, 2026 | 5:41 PM

నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' 100 కోట్ల విజయంతో నెక్స్ట్ లెవెల్‌కి చేరుకున్నారు. వరుస హిట్ల తర్వాత, ఆయన తన రెమ్యునరేషన్‌ను 15 కోట్లకు పెంచినట్లు వార్తలున్నాయి. స్వతహాగా రైటర్ కావడంతో, కథ, డైలాగ్స్‌లో తన ఇన్వాల్వ్‌మెంట్ తప్పనిసరి అని మేకర్స్‌కు కండిషన్స్ పెడుతున్నట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాలెంటెడ్ రైటర్. అంతకు మించి పర్ఫార్మర్. వరుసగా నాలుగు సినిమాలు హిట్టైన ట్రాక్ రికార్డ్ . రీసెంట్‌గా రిలీజ్ అయిన అనగనగా ఒక రాజు మూవీకి 100క్రోర్స్ గ్రాస్ కలెక్షన్స్. అంతే.. నవీన్ పొలిశెట్టి ఒక్క సారిగా నెక్స్ట్‌ లెవల్‌కి వెళ్లిపోయాడట. తన రెమ్యునరేషన్‌ను అమాంతంగా పెంచేశాడట. దాంతో పాటే.. తనతో సినిమా చేయాలంటే కండీషన్స్ అంప్లై అంటున్నాడట. ఎన్నో కష్టనష్టాల తర్వాత టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకున్న నవీన్ పొలిశెట్టి.. ఈ సంక్రాంతికి సోగ్గాడిలా మన ముందుకు వచ్చి హిట్టుకొట్టాడు. అనగనగా ఒక రాజు సినిమాతో పండగ బరిలో దిగి.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కుమ్మేశాడు. దీంతో తాను చేయబోయే నెక్ట్స్‌ సినిమాలకు రెమ్యునరేషన్‌ పెంచేశాడట నవీన్ పొలిశెట్టి. సినిమాకు 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నాడట. తేకాదు మనోడు స్వతహాగా రైటర్ కావడంతో.. కథలోనూ.. డైలాగ్స్‌లోనూ పొలిశెట్టి ఇన్వాల్వ్‌ అవుతాడట. సినిమాకు తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం కాస్త గట్టిగా చేస్తాడట. ఇందుకు మేకర్స్ ఓకే చెబితేనే తనతో సినిమాకు పొలిశెట్టి ఓకే చెబుతాడట. అయితే ఇదంతా రూమరా.. లేక నిజమా అన్నది పక్కకు పెడితే.. ఈ న్యూస్ కాస్తా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nagarjuna: డిజాస్టర్ మూవీ కోసం రూ.1000 కోట్ల ధురంధర్ మిస్ చేసుకున్న నాగ్

Prabhas: రాజాసాబ్ రిజల్ట్‌పై ప్రభాస్ షాకింగ్ రియాక్షన్

Faria Abdullah: అతడితో ప్రేమలో ఉన్నాను.. రిలేషన్‌ పై ఓపెన్ అయినా ఫరియా అబ్దుల్లా

Cheekatilo Review: రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్‌ వస్తుంది

Gold Price: గోల్డ్‌.. సామాన్యులకు ఇక అందని ద్రాక్షేనా..!