Adivi Sesh: కమర్షియల్ హీరోగా మారిపోయిన శేష్

Edited By:

Updated on: Dec 20, 2025 | 4:06 PM

డిఫరెంట్ సినిమాలతో పేరుగాంచిన అడివి శేష్ ఇప్పుడు కమర్షియల్ హీరోగా మారబోతున్నారు. "డెకాయిట్", "గూఢచారి 2" సినిమాలతో ఆయన మాస్ అవతార్ లో కనిపించనున్నారు. లవ్ అండ్ కమర్షియల్ రివెంజ్ స్టోరీగా వస్తున్న "డెకాయిట్" టీజర్ ఇప్పటికే ఆకట్టుకోగా, మార్చి 19న విడుదల కానుంది. ఈ మార్పు శేష్ కెరీర్‌లో ఒక కొత్త దశను సూచిస్తుంది.

సినిమా ఇండస్ట్రీ ఎవర్నైనా మార్చేస్తుంది.. గిరి గీసుకుని డిఫెరెంట్ సినిమాలు చేస్తున్నా కూడా ఎప్పుడో ఓసారి కమర్షియల్ పురుగు మాత్రం కుడుతూనే ఉంటుంది. తాజాగా మరో హీరో కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. డెబ్యూ నుంచే డిఫెరెంట్ సినిమాలు చేస్తున్న ఆయన.. పక్కా మాస్ అవతారంలోకి వచ్చారిప్పుడు. మరి ఆ హీరో ఎవరో చూద్దామా..? ఇండస్ట్రీలో రొటీన్ సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలున్నారు కానీ డిఫెరెంట్‌గా ట్రై చేయడానికి తక్కువ మందే ఉన్నారు. అందులో అడివి శేష్ అందరికంటే ముందుంటారు. క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్, హిట్ 2 ఇలా వరస విజయాలతో దూసుకుపోతున్న శేష్ కూడా కమర్షియల్ రూట్‌లోకి వచ్చేసారిప్పుడు. అడివి శేష్ కూడా కమర్షియల్ ముద్ర కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు డిఫెరెంట్‌గా ట్రై చేసిన ఈయన ఫస్ట్ టైమ్ డెకాయిట్ కోసం పర్ఫెక్ట్ మాస్ హీరోగా మారిపోయారు. ఈ సినిమాకు రైటర్ కూడా ఈయనే. లవ్ అండ్ కమర్షియల్ రివేంజ్ స్టోరీగా వస్తుంది ఈ చిత్రం. టీజర్ చూస్తుంటే.. శేష్ ఖాతాలో మరో హిట్ పడేలాగే ఉంది. మార్చి 19న విడుదల కానుంది ఈ చిత్రం. డెకాయిట్ టీజర్‌లో మరో మేజర్ హైలైట్ హలో బ్రదర్ సినిమాలోని కన్నెపెట్టెరో పాట..! టీజర్ అంతా ఇదే పాటపై కట్ చేసారు. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, అనురాగ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డెకాయిట్ వచ్చిన రెండు నెలలకే.. మే 1న గూఢచారి 2తో రానున్నారు శేష్. ఇది కూడా పక్కా కమర్షియల్ సినిమానే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కొత్తగా పుట్టిన కొడుకే వారసుడని షాకింగ్‌ ప్రకటన

నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌

మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు

Avatar 3 Review: ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ